Share News

ఎండు మిర్చి ధర పతనం

ABN , Publish Date - Feb 12 , 2025 | 11:58 PM

ఎండుమిర్చి ధరలు మరింత పతనమయ్యాయి. రోజు రోజుకూ మార్కెట్లో ఎండు మిర్చి ధరలు దిగజారుతూ బుధవారం ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో గరిష్ఠ ధర కేవలం రూ.13,211 మాత్రమే పలికింది.

ఎండు మిర్చి ధర పతనం
విక్రయానికి వచ్చిన ఎండుమిర్చి బస్తాలు

ఆదోని అగ్రికల్చర్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి) : ఎండుమిర్చి ధరలు మరింత పతనమయ్యాయి. రోజు రోజుకూ మార్కెట్లో ఎండు మిర్చి ధరలు దిగజారుతూ బుధవారం ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో గరిష్ఠ ధర కేవలం రూ.13,211 మాత్రమే పలికింది. సాగు కోసం రూ.లక్షల పెట్టుబడి పెట్టి, ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొని వచ్చిన అరకొర దిగుబడిని విక్రయానికి తీసుకొస్తే వ్యాపారులు తక్కువ ధరకు కొంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదని, అప్పులపాలు అవుతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వమే ఎండుమిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. 1228 ఎండు మిర్చి బస్తాలు విక్రయానికి రాగా వాటి కనిష్ఠ ధర రూ.3వేలు, గరిష్ఠ ధర రూ.13,211, మధ్యస్థ ధర రూ.10,500 పలికింది.

Updated Date - Feb 12 , 2025 | 11:58 PM