Share News

‘తాగునీటి సమస్య తీర్చాలి’

ABN , Publish Date - Jul 11 , 2025 | 01:20 AM

క్రిష్ణరావుపేటలో తాగునీటి సమస్యను పరిష్కరించడం లేదని గుక్కెడు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు కేజీ రెడ్డుపై భైఠాయించారు.

‘తాగునీటి సమస్య తీర్చాలి’
నిరసన తెలుపుతున్న క్రిష్ణరావుపేట గ్రామస్థులు

పాములపాడు, జూలై 10(ఆంధ్రజ్యోతి): క్రిష్ణరావుపేటలో తాగునీటి సమస్యను పరిష్కరించడం లేదని గుక్కెడు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు కేజీ రెడ్డుపై భైఠాయించారు. దీంతో రహదారిపై వాహన రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామస్థులు మాట్లాడుతూ నేషనల్‌ హైవే నిర్మాణపు పనుల్లో గ్రామంలోని తాగునీటి పైపులు దెబ్బతిన్నాయన్నాయన్నారు. దీంతో గత కొంతకాలంగా గ్రామంలో నీటి సరఫరా లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్రాగునీటి సమస్య తీర్చాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Jul 11 , 2025 | 01:20 AM