పది రోజులకోసారి తాగునీరు
ABN , Publish Date - Feb 24 , 2025 | 12:16 AM
మండలంలోని ఎం.అగ్రహారం గ్రామంలో తాగునీరు అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎస్సీ కాలనీలో పది రోజులకోసారి తాగునీరు వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎం.అగ్రహారం ఎస్సీ కాలనీవాసుల ఇబ్బంది
మురుగు కాలువలో పైపులైన్
మద్దికెర, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎం.అగ్రహారం గ్రామంలో తాగునీరు అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎస్సీ కాలనీలో పది రోజులకోసారి తాగునీరు వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాలువలో తాగునీటి పైపులైన్లు
గ్రామంలో దాదాపు 6వేల జనాభా నివసిస్తున్నారు. నాలుగు తాగేనీటి పథకాలను కూడా ఏర్పాటు చేశారు. ఎస్సీ కాలనీలో పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉందని మహిళలు వాపోతున్నారు. మినీ ట్యాంకులు, బోర్లు పని చేయడం లేదు. పైపులైన్లు పగిలిపోయాయి. దీంతో కాలువలోనే బిందెలతో నీరు పట్టుకుంటున్నారు.
బోరు నీటిలో ఫ్లోరైడ్‌నీరు
గ్రామంలోని బోర్లలో ఫ్లోరైడ్ నీరు ఉంది. సమస్యను పరిష్కరిస్తామని ఎన్నికల్లో అభ్యర్థుల హామీ ఇచ్చారు. అనంతరం విషయాన్ని మరిచిపోయారని గ్రామస్థలు ఆరోపిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో ఫ్లోరైడ్ నీటినే తాగాల్సి వస్తోందదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దారులన్నీ మురుగుమయం
కాలనీలో ఏ రహదారి చూసినా మురుగుతో దుర్వాసన వస్తోంది. ఎక్కడా కూడా కాలువలు నిర్మించలేదు. దీంతో అవస్థలు పడుతున్నారు. అపరిశుభ్ర వాతావరణంతో రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎవరూ పట్టించుకోవడం లేదు
మా కాలనీలో పది రోజులకోసారి తాగునీరు వదులుతున్నారు. మోటార్లు ఉన్న వారికి మాత్రమే నీరు వస్తుం ది. మోటర్ లేకుంటే నీరు రాదు. వేసవి రాకముందే పరిస్థితి ఇలా ఉంటే ఇక వేసవిలో ఎలా ఉంటుందో. - రాధమ్మ
సమస్యను పరిష్కరిస్తాం
ఎస్సీ కాలనీలో తాగు నీటి సమస్య ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇప్పటికే సర్పంచ్ విజ యుడు దృష్టికి తీసు కెళ్లాం. సమస్యను పరి ష్కరిస్తాం. - సుధాకర్, ఇన్‌చార్జి కార్యదర్శి