డ్ర గ్స్‌తో జీవితాన్ని నాశనం చేసుకోవద్దు
ABN , Publish Date - Oct 10 , 2025 | 12:03 AM
విద్యార్థులు డ్రగ్స్ జోలికి వెళ్లి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, డ్రగ్స్‌కు దూరంగా ఉండి సంతోషకరమైన జీవితాలను గడుపుదామని కర్నూలు సెట్కూరు సీఈవో వేణుగోపాల్ పిలుపునిచ్చారు.
కౌతాళం, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు డ్రగ్స్ జోలికి వెళ్లి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, డ్రగ్స్‌కు దూరంగా ఉండి సంతోషకరమైన జీవితాలను గడుపుదామని కర్నూలు సెట్కూరు సీఈవో వేణుగోపాల్ పిలుపునిచ్చారు. కౌతాళం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం విద్యార్థులకు మత్తు పదార్థాల వ్యసనం-పర్యవసనాలు, సైబర్ క్రైమ్ అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సెట్కూర్ సీఈవో మాట్లాడుతూ నేటి సమాజం ఎదుర్కొంటున్న సమస్యలలో డ్రగ్స్ ఒకటని దీనివల్ల యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. ఎక్కడైనా డ్రగ్స్ విక్రయిస్తే 1972కు సమాచారం అందించాలన్నారు. అనంతరం కౌతాళం ఏఎస్‌ఐ రమణా రెడ్డి మాట్లాడుతూ సైబర్ మోసాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సెల్‌ఫోన్లలకు సైబర్ మోసగాళ్ళు ఎస్‌ఎంఎస్ ద్వార లింక్‌లను పంపుతూ మోసాలు చేస్తుంటారని, కొత్త నెంబర్ల నుంచి సైబర్ మోసగాళ్లు ఫోన్ చేస్తే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలన్నారు. ముఖ్యంగా డ్రంకెన్ డ్రైవ్‌పై ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలిపారు. రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. సమావేశంలో కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డేవిడ్, సెట్కూర్ పర్యవేక్షకుడు శ్యాం బాబు, హెడ్ కానిస్టేబుల్ సోమ్ల నాయక్, అధ్యాపకులు పాల్గొన్నారు.