Share News

మాతృభాషను మరువరాదు

ABN , Publish Date - Feb 22 , 2025 | 12:04 AM

మాతృభాషను మరువరాదని నెహ్రూ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం అలీంసిద్ధికి అన్నారు. మండలంలోని పాఠశాలల్లో శుక్రవారం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ వేడుకలు నిర్వహిచారు.

మాతృభాషను మరువరాదు
ఆదోని ఆర్‌ఆర్‌ లేబర్‌ కాలనీలో తెలుగు ఉపాధ్యాయులకు సన్మానం

ఘనంగా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం

ఆదోని అగ్రికల్చర్‌, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): మాతృభాషను మరువరాదని నెహ్రూ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం అలీంసిద్ధికి అన్నారు. మండలంలోని పాఠశాలల్లో శుక్రవారం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ వేడుకలు నిర్వహిచారు. పాఠశాలల్లో తెలుగుతల్లి, కృష్ణదేవరాయ కవుల వేషధారణతో చిన్నారులు ఆకట్టుకున్నారు. మాతృ భాష ప్రాముఖ్యతపై ఉపాధ్యాయులు వివరించారు. పర భాష మోజులో పడి మాతృభాషను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భాషా సంస్కృతి వైవిధ్యాన్ని కాపాడుకోవాలని అరసం జిల్లా అధ్యక్షుడు కలం ప్రహ్లాద అన్నారు. కిల్చిన్‌ పేట పురపాలక ప్రాథమికోన్నత పాఠశా లలో హెచ్‌ఎం సునీల్‌ రాజ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో అలాగే ఆర్‌ఆర్‌ లేబర్‌ కాలనీ పురపాలక పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు రమేష్‌ నాయుడుని సన్మానించారు. పెద్ద హరివాణం జెడ్పీ పాఠశాలలో ఇందిరా దేవి ఆధ్వర్యంలో, నేషనల్‌ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో కరస్పాండెంట్‌ గోపాల్‌ రెడ్డి తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు.

మృతభాష తల్లిలాంటిది

దేవనకొండ: మాతృభాష తెలుగు కన్న తల్లిలాంటిందని జెడ్పీపాఠశాల హెచ్‌ఎం మద్దిలేట్టి, తెలుగు ఉపాధ్యా యురాలు పల్లె ఉమాదేవి అన్నారు. స్థానిక జెడ్పీ పాఠశాలలో మాతృభాష దినోత్సవ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు ఎక్కడికెళ్లిన మాతృబాష తెలుగుని విస్మరించకుండా, తెలుగు తియ్యదనం, గొప్పతనంగా తేలియజేయాలన్నారు.

Updated Date - Feb 22 , 2025 | 12:04 AM