అన్నదానానికి విరాళం
ABN , Publish Date - Sep 18 , 2025 | 12:52 AM
పట్టణంలోని వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి ఆత్మకూరుకు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ తాళ్లపల్లి రంగశాయి, శ్యామలసాయి దంపతులు రూ.1,11,116 విరాళం అంద జేశారు.
ఆత్మకూరు, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి ఆత్మకూరుకు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ తాళ్లపల్లి రంగశాయి, శ్యామలసాయి దంపతులు రూ.1,11,116 విరాళం అంద జేశారు. విరాళం చెక్కును వారి కుమారుడు సాయిశ్రీకాంత్ బుధవారం అన్నదాన కమిటీ అధ్యక్షులు రామయ్య, కోశాధికారి జక్కా మురళీకి అందజేశారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. వెంకటేశ్వర స్వామి ఆలయ అన్నదాన కార్యక్రమానికి దాతలు ముందుకొచ్చి సహకారాన్ని అందించడం సంతోషకరమని అన్నారు.