ఉరుకుంద క్షేత్రానికి రూ.లక్ష విరాళం
ABN , Publish Date - Oct 09 , 2025 | 11:57 PM
ప్రముఖ పుణ్యక్షేత్రం ఉరుకుంద ఈరన్న స్వామి క్షేత్రంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు గురువారం ఓ భక్తుడు రూ.లక్ష నగదును విరాళంగా అందజేసినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్, ఈవో వాణి తెలిపారు.
కౌతాళం, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రం ఉరుకుంద ఈరన్న స్వామి క్షేత్రంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు గురువారం ఓ భక్తుడు రూ.లక్ష నగదును విరాళంగా అందజేసినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్, ఈవో వాణి తెలిపారు. గురువారం ఆమె విలేకరుల తో మాట్లాడుతూ దేవాలయంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు తెలంగాణ రాష్ట్ర జోగులాంబ గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్‌కు చెందిన వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు రూ.1,00,116 నగదును ఆలయంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆలయ కార్యాలయం నందు అందజేసినట్లు తెలిపారు. దాతలకు ఆలయ ఉప ప్రధాన అర్చకులు మహదేవప్ప స్వామి దాతలకు స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయించి లడ్డూ ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఈరప్ప స్వామి ఉన్నారు.