Share News

ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారా లేదా?

ABN , Publish Date - Feb 13 , 2025 | 12:53 AM

రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారా..లేదా.. రైతులు, ప్రజల సమస్యలను ఎందుకు పరిష్కరించడంలేదంటూ జాయింట్‌ కలెక్టర్‌ నవ్యా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారా లేదా?
సీఎల్‌ఎస్‌ గోడౌనను పరిశీలిస్తున్న జాయింటె కలెక్టర్‌ నవ్య

రైతులకు, ప్రజలకు న్యాయం చేయడమే రెవెన్యూ శాఖ ముఖ్య ఉద్దేశం

రెవెన్యూ సిబ్బందిపై జేసీ నవ్య ఆగ్రహం

ఎమ్మిగనూరు రూరల్‌, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారా..లేదా.. రైతులు, ప్రజల సమస్యలను ఎందుకు పరిష్కరించడంలేదంటూ జాయింట్‌ కలెక్టర్‌ నవ్యా ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మండలంలోని కడిమెట్ల గ్రామంలో రీ సర్వేను పరిశీలించారు. అనంతరం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో వీఆర్వోలు, సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బందితో సమావేశాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ మీరు ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారా..లేదా.. ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. జిల్లాలోనే రైతులను, ప్రజలను ఇబ్బందులకు గురిచేసే స్థానంలో ఎమ్మిగనూరు రెండో స్థానంలో ఉండడం ఏమిటని ప్రశ్నించినట్లు తెలిసింది. ఎవరైనా అవి నీతి, అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేదిలేదని తీవ్రస్థాయిలో అధికారు లను హెచ్చరించారు. కొన్ని గ్రామాల్లో పనిచేస్తున్న వీఆర్వోలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తు న్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఇది మంచి పద్ధతి కాదని, మరొకసారి ఇలాంటి ఫిర్యాదులు తమ దృష్టికి వస్తే సహించేదిలేదని మండిపడ్డారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జేసీ మాట్లాడుతూ రీ సర్వే జరుగుతున్న గ్రామాల్లో అవి నీతికి చోటు లేకుండా సేవలను అందిస్తామన్నారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్‌ చల్లా కళ్యాణి, ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్యా భరద్వాజ్‌, తహసీ ల్దార్‌ శేషఫణి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

సీజ్‌ చేసిన బియ్యాన్ని ఎందుకు ఇలాగే ఉంచారు?

సీజ్‌ చేసిన బియ్యాన్ని ఎందుకు ఇలాగే బస్తాల్లో ఉంచారని జాయిం ట్‌ కలెక్టర్‌ నవ్యా ప్రశ్నించారు. బుధవారం ఎమ్మిగనూరుకు వచ్చిన ఆమె ముగతి సమీపంలో ఉన్న బియ్యం గోడౌనను పరిశీలించారు. గోడౌన అధికారిలతో మాట్లాడుతూ ఎన్నో రోజులుగా ఉన్న బియ్యాన్ని ఇలా ఉంచితే ఎలా.. ఈ బియ్యాన్ని పేదలకు అందజేసేందుకు ఎందుకు తమను సంప్రదించలేదంటూ మండిపడ్డారు. మూడు నెలులుగా బియ్యం సరఫరా వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. ఇందుకు గోడౌన సిబ్బంది సమాధానం చెప్పలేకపోయారు.

వినతుల వెల్లువ: ఎమ్మిగనూరుకు వచ్చిన జాయింట్‌ కలెక్టర్‌ నవ్యా కు రైతులు, ప్రజలు వినతులు ఇచ్చేందుకు క్యూ కట్టారు. అయితే స్థానిక అధికారులు మాత్రం బాధితులను అడ్డుకున్నారు. రీ సర్వే జరి గిన గ్రామాల్లో భూమి ఎక్కువగా ఉన్న రైతులకు తక్కువగా నమోదు చేశారని..తక్కువగా ఉన్న రైతులకు ఎక్కువగా నమోదు చేశారని ఏఐకే ఎంఎస్‌, ఐఎఫ్‌టీయూ నాయకులు సత్యన్న, బాలరాజు వినతిపత్రం అందజేశారు. అలాగే నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్‌ నాయకులు సుమాల చార్లెస్‌ రేషన బియ్యాన్ని ఎండీయూ వాహనాల ద్వారా ఇంటికి సరఫరా చేయడంలేదని, మంత్రాలయం మండలం విద్యుశాఖ ఏఈ మల్లయ్య, కాంట్రాక్టర్‌ రఘులపై చర్యలు తీసుకోవాలని ఏపీ ఎమ్మార్పీఎస్‌ నాయకులు నేపాల్‌ వినతిపత్రాలను అందజేశారు.

Updated Date - Feb 13 , 2025 | 12:53 AM