Share News

గ్రామాల్లో అల్లర్లు సృష్టిస్తే ఉపేక్షించొద్దు : డీఎస్పీ

ABN , Publish Date - Jan 31 , 2025 | 12:26 AM

గ్రామాల్లో అల్లర్లు సృష్టించే వారిని ఉపేక్షించొద్దుని ఎమ్మిగనూరు డీఎస్పీ ఉపేంద్రబాబు ఆదేశించారు.

గ్రామాల్లో అల్లర్లు సృష్టిస్తే ఉపేక్షించొద్దు : డీఎస్పీ
మాట్లాడుతున్న డీఎస్పీ ఉపేంద్రబాబు

మంత్రాలయం, జనవరి 30(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో అల్లర్లు సృష్టించే వారిని ఉపేక్షించొద్దుని ఎమ్మిగనూరు డీఎస్పీ ఉపేంద్రబాబు ఆదేశించారు. గురువారం మండలంలోని మాధవరం పోలీసుస్టేషన, చెక్‌పోస్టు, తుంగభద్ర రైల్వేస్టేషనలను డీఎస్పీ తనిఖీ చేశారు. కేసులు నమోదు, సిబ్బంది, శాంతిభద్రతలు అదుపు, కర్ణాటక మద్యం, కేసుల పరిష్కారం, పోలీస్‌స్టేషనలో మౌలిక సదుపాయాలు, రౌడీషీటర్ల వివ రాలు వంటి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ మూడు రోజుల క్రితం రచ్చమర్రి గ్రామంలో జరిగిన చోరీ కేసును ఛేదించేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలో నిందితులను అరెస్టు చేస్తామన్నారు. ఇప్పటికే అను మానితుల వేలిముద్రణలు సేకరించామన్నారు. సమస్యా త్మక గ్రామా లపై ప్రత్యేక దృష్టి ఉంచాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు అవగాహన కల్పించాలన్నారు. గతంలో ఉన్న పెండింగ్‌ కేసుల్లో పురోగతి సాధించిన మంత్రాలయం సీఐ రామాంజులు, ఎస్సై విజయ్‌ కుమార్‌ను అభినందించారు. కార్యక్ర మంలో సిబ్బంది వీరేశ, భాస్కర్‌, వీరేశ, రామకృష్ణ, సోమశేఖర్‌, రాఘ వేంద్ర, హనుమంతులు పాల్గొన్నారు.

Updated Date - Jan 31 , 2025 | 12:26 AM