టీడ్కో గృహాల శిథిలావస్థ
ABN , Publish Date - Feb 13 , 2025 | 11:13 PM
పట్టణ శివారులోని శివారులోని శిరుగుప్ప రోడ్డులో టీడీపీ ప్రభుత్వం 4,704 ఇళ్లు నిర్మించింది. షేర్‌వాల్ సాంకేతిక పరిజ్ఞానంతో రూ.కోట్లు ఖర్చు చేసింది. దాదాపు 80శాతం పనులు పూర్తయ్యాయి. అయితే అనంతరం అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం 1,632 మంది లబ్దిదారులకు తాళాలు ఇచ్చింది. కానీ కనీస వసతులు లేక ఇళ్లలో చేరేందుకు లబ్దిదారులు ఆసక్తి చూపడం లేదు.

కనీస వసతులు లేకపోవడంతో చేరని లబ్ధిదారులు
పిచ్చిమొక్కలతో నిండిన గృహాలు
ఆదోని, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): పట్టణ శివారులోని శివారులోని శిరుగుప్ప రోడ్డులో టీడీపీ ప్రభుత్వం 4,704 ఇళ్లు నిర్మించింది. షేర్‌వాల్ సాంకేతిక పరిజ్ఞానంతో రూ.కోట్లు ఖర్చు చేసింది. దాదాపు 80శాతం పనులు పూర్తయ్యాయి. అయితే అనంతరం అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం 1,632 మంది లబ్దిదారులకు తాళాలు ఇచ్చింది. కానీ కనీస వసతులు లేక ఇళ్లలో చేరేందుకు లబ్దిదారులు ఆసక్తి చూపడం లేదు.
80 శాతం పనులు పూర్తి
2014 నుంచి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వం టీడ్కో ఇళ్లను నిర్మించి, దాదాపు 80శాతం పనులు పూర్తి చేసింది. అనంతరం వచ్చిన వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో లబ్ధిదారులు నిరాశ చెందుతున్నారు.
పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం
2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపణలు ఉన్నాయి. టీడీపీకి పేరు వస్తుందన్న కక్షతో పక్కన పెట్టిందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గృహ సముదాయాల నిర్వహణ గాలికి వదిలేయడంతో గృహాలు శిథిలావస్థకు చేరాయి.
కాంప్లెక్స్ చుట్టూ పిచ్చిమొక్కలు
టిడ్కో గృహాల నిర్వహణ సరిగా లేకపోవడంతో ఇళ్ల చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. చాలా గృహాల్లోని కిటికీల అద్దాలు ఊడిపోయి, తలుపులు చెదలు పట్టి విరిగిపోయాయి. పిచ్చి మొక్కలు పెరిడంతో విష పరుగులు, పాములకు ఆవాసాలయ్యాయి.
సదుపాలు కల్పిస్తే ఉపయోగం
ఇప్పటికే పనులు పూర్తయినా కాలనీలో మౌళిక సదుపాయాలు లేకపోవడంతో లబ్ధిదారులు చేరేందుకు సిద్ధంగా లేరు. తాగునీరు, విద్యుత్, సెక్యూరిటీ, పారిశుధ్య నిర్వహణ ఉంటే లబ్ధిదారులు చేరే అవకాశముంది. రూ.కోట్ల ప్రజాధనం వెచ్చించి నిర్మించిన గృహాలు ఇలా నిరుపయోగంగా ఉండటంపై లబ్ధిదారులు నిరాశ చెందుతున్నారు. ఓహెచ్‌ఆర్ ట్యాంకును అసంపూర్తిగా వదిలేశారు.
చేరేందుకు లబ్ధిదారుల వెనకడుగు..
పట్టణానికి దూరంగా ఉండటం, రవాణా ఖర్చులు పెరిగిపోతుండటంతో ఇళ్లలో నివసించేం దుకు పేదలు ఆందోళన చెందుతున్నారు. 1,632 ఇళ్లు అప్పగించినా ఎవరూ ముందుకు రాలేదు. కనీస వసతులు కల్పిస్తేతప్ప ఇళ్లలోకి చేరలేమంటూ లబ్ధిదారులు ఎమ్మెల్యే పార్థసారథికి తేల్చి చెప్పారు.