తవ్వుకో.. అమ్ముకో
ABN , Publish Date - Mar 07 , 2025 | 12:25 AM
ప్రకృతి ప్రసాదించిన కొండలు, గుట్టలు కరిగిపోతున్నాయి.

ఓర్వకల్లు మండలంలో యథేచ్ఛగా మట్టి దందా
రూ.లక్షలు గడిస్తున్న అక్రమార్కులు
చోద్యం చూస్తున్న అధికారులు
ఓర్వకల్లు, మార్చి 6(ఆంధ్రజ్యోతి): ప్రకృతి ప్రసాదించిన కొండలు, గుట్టలు కరిగిపోతున్నాయి. ఓర్వకల్లు మండలంలోని ప్రభుత్వ భూము ల్లో ఉన్న ఎత్తైన కొండలు, గుట్టలు అధికార బలంతో నిర్భీతిగా దోచేస్తు న్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. అధి కార పార్టీ ముసుగులో కొందరు నాయకులు యథేచ్ఛగా మట్టి తవ్వు కొని అక్రమార్జనకు తెగబడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. మండలం లోని నన్నూరు గ్రామ సమీపంలోని ఆంజనేయస్వామి గుడి వద్ద, పూడిచెర్ల చెరువు ఎదురుగా, కాల్వ గ్రామం సమీపంలోని పుట్టగొడు గుల పరిశ్రమ వద్ద కొందరు ఎర్రమట్టిని తవ్వుకొని జేబులు నింపుకుం టున్నారు. మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు ఈ మట్టి మాఫియాకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మం డలంలోని ఓర్వకల్లు, పూడిచెర్ల, నన్నూరు, హస్సేనాపురం, కాల్వబుగ్గ, సోమయాజులపల్లె గ్రామాల పరిధిలోని జాతీయ రహదారికి ఇరువె ౖపులా ప్రైవేట్ వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఆ వెంచర్లలో అంతర్గత రహదారుల ఏర్పాటుకు అవసరమైన ఎర్రమట్టి కోసం రాత్రి, పగలు తేడా లేకుండా భారీ యంత్రాలు, ఎక్స్‌కవేటర్లతో మట్టిని తవ్వి జాతీయ రహదారిపై టిప్పర్లలో అక్రమంగా తరలిస్తూ రూ. లక్షలు సంపాదిస్తున్నారు. ఒక్కో టిప్పర్ లోడును దూరాన్ని బట్టి రూ.4 వేల నుంచి రూ.7 వేలకు అమ్ముకుంటున్నట్లు సమాచారం. రియల్ ఎస్టేట్, వెంచర్లు, ప్రైవేటు భవనాలు, పరిశ్రమలకు అవసరమైన మట్టిని ఇషా ్టరాజ్యంగా అడ్డదారుల్లో సేకరిస్తున్నారు. చివరకు ఏపీఐఐసీ భూములను సైతం మట్టి మాఫియా వదలడం లేదు. ఇంత జరుగుతున్నా మైనింగ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎనఓసీ తీసుకొని చలానా కట్టి మట్టి తవ్వకాలు జరపాలి. కానీ అవేవీ అమలు కావడం లేదు.
కఠిన చర్యలు తీసుకుంటాం
మండలంలో ఎర్రమట్టి తరలిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై క్షేత్ర స్థాయిలో విచారిస్తాం. అను మతి లేకుండా మట్టి తవ్వి తరలిస్తే వాహనాలను జప్తు చేస్తాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
- విద్యాసాగర్, తహసీల్దార్, ఓర్వకల్లు