మంత్రాలయంలో పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Jan 31 , 2025 | 12:24 AM
మంత్రాలయం రాఘ వేంద్ర స్వామి దర్శనార్థం భక్తులు పోటెత్తారు.

మంత్రాలయం, జనవరి 30(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘ వేంద్ర స్వామి దర్శనార్థం భక్తులు పోటెత్తారు. గురువారం రాఘవేం ద్రస్వామికి ఇష్టమైన దినం కావటంతో దక్షణాది రాష్ర్టాలైన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో మఠం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, మధ్వమార్గ్ కారిడార్, ప్రధాన రహదారులు, రాఘవేంద్ర సర్కిల్, నదితీరం భక్తులతో కోలాహాలంగా మారింది. గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథోత్సవాల ఊరేగింపులో పాల్గొని భక్తులు పీఠాధిపతి ఆశీస్సులు పొందారు.
చెక్క రథంపై ప్రహ్లాదరాయలు: రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు చెక్క రథంపై విహరించారు. రాఘవేంద్ర స్వామి సజీవ సమాధి పొందిన శుభ దినాన్ని పురస్కరించుకుని మఠం పీఠాధిపతి సుభుధేంద్రతీర్థుల ఆధ్వర్యంలో పండితులు, అర్చకులు రాఘ వేంద్రస్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెక్క రథాన్ని వివిధ పుష్పాలతో అలంకరించి, వేద పండితుల మంత్రో చ్ఛరణాలు, మంగళ వాయిద్యాల మధ్య వజ్రాలు పొదిగిన ప్రహ్లాద రాయలను అధిష్టించి ఆలయ ప్రాంగణం చుట్టూ ఊరేగించారు. అనం తరం ఊంజల మంటపంలో ఊంజలసేవ నిర్వహించారు. అంతక ముందు స్వామి వారికి పాదపూజ చేసి పల్లకిలో ఊరేగించారు. పూర్ణ బోధపూజ మందిరంలో పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు మూల రాములకు బంగారు నాణేలతో అభిషేకం చేశారు.