Share News

ఆలయాలకు పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Dec 20 , 2025 | 12:07 AM

అమావాస్య సందర్భంగా శుక్రవారం ఉరుకుంద ఈరన్న స్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు.

ఆలయాలకు పోటెత్తిన భక్తులు
ఉరుకుంద క్షేత్రంలో దర్శనానికి వచ్చిన భక్తులు

కౌతాళం, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): అమావాస్య సందర్భంగా శుక్రవారం ఉరుకుంద ఈరన్న స్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఆలయ డిప్యూటీ కమిషనర్‌, ఈవో వాణి ఆలయంలో స్వామికి లక్ష పుష్పార్చన, భక్తులు పుష్పార్చన చేపట్టారు. భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. అంతకు ముందు ఆలయ అర్చకులు స్వామి వారి మూలవిరాట్‌కు వెండి అలంకరణ చేపట్టారు. ప్రత్యేక పుష్పాల తో అలంకరించి మూలవిరాట్‌ను వెండి తొడుగుతో అలంకరించి మహా మంగళ హారతి ఇచ్చారు. తూర్పు రాజగోపురం నుంచి ఆలయ అధికారులు భక్తులకు స్వామి దర్శనం కల్పించారు. అన్నదాన సత్రంలో అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్ధం ఆలయ అధికారులు ఆలయం మెరుగైన సౌకర్యాలు కల్పించారు.

మంత్రాలయం: మంత్రాలయం పుణ్యక్షేత్రంలో ప్రహ్లాదరాయల పల్లకోత్సవం రమణీయంగా నిర్వహించారు. శుక్రవారం రాత్రి అమావాస్యను శుభదినాన్ని పురస్కరించుకొని మఠం పీఠాధిపతి సుబుఽధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఊంజలసేవ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో శ్రీమఠం కిటకిటలాడింది.

Updated Date - Dec 20 , 2025 | 12:07 AM