మంత్రాలయంలో కిక్కిరిసిన భక్తులు
ABN , Publish Date - Feb 24 , 2025 | 12:43 AM
రాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో మంత్రాలయం కిక్కిరిసింది.

మంత్రాలయం, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో మంత్రాలయం కిక్కిరిసింది. మాఘ దశమి, ఆదివారం సెలవు దినం కావడంతో దక్షణాది రాష్ర్టాలనుంచి వే లాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో మఠం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. బుధ, గురు, శుక్ర, శని, ఆదివారం వరకు వేలాది మంది భక్తులు రావడంతో మఠం అతిధి గృహలు, ప్రైవేట్ లాడ్జిలు భక్తులతో నిండిపోయాయి. అద్దె రూములు దొరకక మధ్వమార్గ్ కారిడార్ ముందే భక్తులు బసచేశారు. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, ప్రధాన రహదారులు, రాఘవేంద్ర సర్కిల్, తుంగభద్ర నదితీరం భక్తులతో కోలాహాలంగా మారింది. గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్ వెంకటేష్ జోషిలు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. సొంత వాహనాల్లో వచ్చిన భక్తులు ప్రధాన రహదారిపై ఇరువైపులా పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ సమస్యతో భక్తులు, గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు.