కోటి రూపాయలతో అభివృద్ధి పనులు
ABN , Publish Date - Aug 07 , 2025 | 11:55 PM
మహానంది మండలం తమ్మడపల్లిలో శిథిలావస్థలో ఉన్న కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయం అభివృద్ధికి దేవదాయశాఖ రూ. 1 కోటి నిధులతో అభివృద్ధి పనులను చేస్తున్నట్లు మహానంది దేవస్థానం ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
మహానంది, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): మహానంది మండలం తమ్మడపల్లిలో శిథిలావస్థలో ఉన్న కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయం అభివృద్ధికి దేవదాయశాఖ రూ. 1 కోటి నిధులతో అభివృద్ధి పనులను చేస్తున్నట్లు మహానంది దేవస్థానం ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం తమ్మడపల్లిలోని కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయాన్ని ఈవో పరిశీలించారు. గ్రామ పెద్దలతో మాట్లాడారు. ఆలయ జీర్ణోద్ధరణ పనుల కోసం టెండర్లు పిలిచామన్నారు. దీనికోసం ఆలయంలో బాలా లయం పూజలు చేసి నిర్మాణ పనులను చేస్తామన్నారు. దేవస్థానం ఇంజనీరింగ్ అధికారి శ్రీనివాసులు, అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.
ఉచిత ప్రసాదం తయారీలో నాణ్యత పాటించాలి
భక్తులకు నిరంతరం ఉచితంగా అందించే ప్రసాదం తయారిలో నాణ్యత పాటించాలని ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి సూచిం చారు. మహానంది ఆలయంలో భక్తులకు దేవస్థానం ఉచితంగా పంపిణీ చేసే ప్రసాదాన్ని గురువారం ఈవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రసాదం పంపిణీలో ఎలాంటి లోటు లేకుండా కూడాలని, ఆలయ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దర్శనం సమయంలో భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలన్నారు. పర్యవేక్షకులు శశిధర్‌రెడ్డి, సుబ్బారెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ నాగమల్లయ్య, ఏఈ శ్రీనివాసులు పాల్గొన్నారు.