Share News

అభివృద్ధి పనులు చేపట్టాలి: ఈవో

ABN , Publish Date - Jul 20 , 2025 | 12:05 AM

శిఖరేశ్వర ఆల యంలో అభివృద్ధి పనులు చేపట్టాలని శ్రీశైల క్షేత్ర ఈవో శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు.

అభివృద్ధి పనులు చేపట్టాలి: ఈవో
పరిశీలిస్తున్న ఈవో శ్రీనివాసరావు

నంద్యాల కల్చరల్‌, జూలై 19(ఆంధ్రజ్యోతి): శిఖరేశ్వర ఆల యంలో అభివృద్ధి పనులు చేపట్టాలని శ్రీశైల క్షేత్ర ఈవో శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. శనివారం ఆలయాన్ని సందర్శించారు. ఈవో మాట్లాడుతూ శిఖరేశ్వర ఆలయ పుష్కరిణి వద్ద కోనేరు విశిష్టతను, క్షేత్ర విశేషాలను బొమ్మలతో కూడిన బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. విరాళాల కేంద్రం ఏర్పాటు, ఉచిత పాదరక్షలు భద్రపరుచుకునే స్థలం, వీరభద్రస్వామి ముందుభాగంలో గ్రిల్‌ తదితర పనులు చేపట్టాలన్నారు. ఈఈ నరసింహారెడ్డి, సహాయ ఇంజనీర్లు ఉన్నారు.

Updated Date - Jul 20 , 2025 | 12:06 AM