Share News

అభివృద్ధి, సంక్షేమమే టీడీపీ ధ్యేయం

ABN , Publish Date - Feb 13 , 2025 | 01:02 AM

అభివృద్ది, సంక్షేమ పథకాలను అమలు చేయడమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయమని ఆ పార్టీ కార్యనిర్వహక కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర, కార్యదర్శులు బత్తిన వెంకట్రా ముడు, తిమ్మయ్య చౌదరి అన్నారు.

అభివృద్ధి, సంక్షేమమే టీడీపీ ధ్యేయం
మాట్లాడుతున్న తుగ్గలి నాగేంద్ర, బత్తిన

తుగ్గలి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): అభివృద్ది, సంక్షేమ పథకాలను అమలు చేయడమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయమని ఆ పార్టీ కార్యనిర్వహక కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర, కార్యదర్శులు బత్తిన వెంకట్రా ముడు, తిమ్మయ్య చౌదరి అన్నారు. బుధ వారం తుగ్గలి నాగేంద్ర స్వగృహంలో విలేక రుల సమావేశంలోమాట్లాడుతూ గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి పని కూడా వైసీపీ చేయలేదని, టీడీపీ వచ్చిన ఏడు నెలల్లోపే అభివృద్ధి పనులను చేస్తున్నామ న్నారు. పోలవరం, అమరావతితో పాటు గ్రామాలన్నీ అభివృద్ధి చేయడమే సీఎం చంద్రబాబు ధ్యేయమన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే శ్యాంబాబు కృషి చేస్తు న్నారని, ఫ్యాక్టరీల ఏర్పాటుకు ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయన్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి పందికోన రిజర్వాయర్‌ నుంచి ఎత్తిపోతల ద్వారా నీటి సమస్య రాకుండా చేస్తామన్నారు. అభివృద్ది జరగలే దని వైసీపీ నాయకులు విమర్శలు చేయడం తగదన్నారు. టీడీపీ గురించి మాట్లాడే ముం దు మీ ప్రభుత్వంలో ఏమి చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. వెంకట స్వామి, చంద్రశే ఖర్‌ యాదవ్‌, సర్పంచులు ఓబులేసు, రవి, మాజీ సర్పంచ్‌ లింగమయ్య ఉన్నారు.

Updated Date - Feb 13 , 2025 | 01:02 AM