దిగజారిన ఎండు మిర్చి ధరలు
ABN , Publish Date - Feb 22 , 2025 | 11:06 PM
ఎండు మిర్చి ధరలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. శనివారం ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో గత వారంతో పోల్చితే ఎండుమిర్చి ధర క్వింటానికి రూ.2వేలకు పైగా ధర పతనమైంది.
క్వింటం గరిష్ఠంగా రూ. 11,816
ఆదోని అగ్రికల్చర్, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి) : ఎండు మిర్చి ధరలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. శనివారం ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో గత వారంతో పోల్చితే ఎండుమిర్చి ధర క్వింటానికి రూ.2వేలకు పైగా ధర పతనమైంది. మిర్చి సాగు చేసిన రైతులు పతనమైన ధరలను చూసి దిగాలు చెందుతున్నారు. పంటకు పెట్టిన పెట్టుబడి ఖర్చులు ప్రస్తుతం మార్కెట్‌లో పలుకుతున్న ధరలతో ఏ మాత్రం గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త కూలీలు కూడా రాక అప్పుల పాలవుతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 945 బస్తాలు ఎండుమిర్చి విక్రయానికి రాగా వాటి కనిష్ఠ ధర క్వింటం రూ. 2000, గరిష్ఠ ధర రూ.11,816, మధ్యధర రూ.8869 పలికింది.