Share News

శ్రీశైలంలో భక్తుల రద్దీ

ABN , Publish Date - Feb 16 , 2025 | 11:39 PM

శ్రీశైలం మహాక్షేత్రానికి ఆదివారం వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ క్యూలైన్లు, ప్రధాన వీధులలో రద్దీ నెలకొంది.

శ్రీశైలంలో భక్తుల రద్దీ

శ్రీశైలం, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం మహాక్షేత్రానికి ఆదివారం వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ క్యూలైన్లు, ప్రధాన వీధులలో రద్దీ నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాలు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనార్థం తరలి వచ్చారు. వేకువజాము నుంచే అధి క సంఖ్యలో భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి, గంగమ్మకు దీపహారతులు సమర్పించారు. అలాగే వందల సంఖ్యలో భక్తులు దేవస్థానం కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించు కున్నారు. స్వామి, అమ్మవార్ల దర్శనార్థం క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. క్యూలైన ్లలోని భక్తులకు దేవస్థానం అధికారులు నిరంత రం తాగునీరు, అల్పాహారం అందజేశారు. క్షేత్రంలోని నిత్యఅన్నదాన సత్రాలు అన్నదానం నిర్వహించాయి.

Updated Date - Feb 16 , 2025 | 11:39 PM