Share News

మంత్రాలయంలో భక్తుల రద్దీ

ABN , Publish Date - Dec 19 , 2025 | 12:36 AM

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు వెండి రథంపై భక్తులకు దర్శనమిచ్చారు.

మంత్రాలయంలో భక్తుల రద్దీ
భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీమఠం

మంత్రాలయం, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు వెండి రథంపై భక్తులకు దర్శనమిచ్చారు. గురువారం మార్గశిర చతుర్దశి శభదినాన్ని పురస్కరించుకుని శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో అర్చకులు బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బృందావనాన్ని బంగారు, వెండి, పట్టువస్ర్తాలు, ప్రత్యేక పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. పూర్ణభోధ పూజ మందిరంలో ఉత్సవమూర్తికి పాదపూజ చేసి పల్లకిలో ఊరేగిం చారు. మూలరాములు, జయరాములు, దిగ్విజయ రాములకు పీఠాధిపతి బంగారు నాణేలతో అభిషేకం చేశారు. అనంతరం వెండి రథం పాటు బంగారు రథానికి వివిధ పుష్పాలతో అలంకరించి, వేద పండితుల మంత్రోచ్ఛరణాలు, మంగళ వాయిద్యాల మధ్య ప్రహ్లాదరాయలను అధిష్ఠించి, మంగళ హారతులు ఇచ్చి ఆలయ ప్రాంగణం చుట్టూ ఊరేగించారు. అనంతరం ఊంజలసేవ నిర్వహించారు.

రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో మంత్రాలయం మార్మోగింది. గురువారం రాఘవేంద్రస్వామి సజీవ సమాధి పొందిన శుభదినం కావటంతో దక్షణాది రాష్ర్టాలైన ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి వే లాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో మఠం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. తుంగభద్ర నది తీరం భక్తులతో కోలాహాలంగా మారింది. తుంగభద్ర నదిలో పుణ్య స్నానాలు ఆచరించి గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated Date - Dec 19 , 2025 | 12:36 AM