సస్యరక్షణ చర్యలు పాటించాలి
ABN , Publish Date - Jun 26 , 2025 | 12:51 AM
మొక్కజొన్న పంటలో కాండం తొలిచే పురుగు చాలా ఉధృతంగా ఉందని, రైతులు ఎప్పటికప్పుడు నూతన సస్యరక్షణ చర్యలు పాటించాలని నందికొట్కూరు ఏవో షేక్షావలి రైతులకు సూచించారు.
నందికొట్కూరు రూరల్, జూన్ 25(ఆంధ్రజ్యోతి): మొక్కజొన్న పంటలో కాండం తొలిచే పురుగు చాలా ఉధృతంగా ఉందని, రైతులు ఎప్పటికప్పుడు నూతన సస్యరక్షణ చర్యలు పాటించాలని నందికొట్కూరు ఏవో షేక్షావలి రైతులకు సూచించారు. నందికొట్కూరు అలాగే బిజినవేముల గ్రామంలో పంట పొలాలలో రైతులు సాగు చేసిన మొక్క జొన్నపంటలను ఏవో, వ్యవసాయ అనుబంధ శాఖ అధికారులు, న్యాచురల్ ఫామింగ్ అధికారులు రైతులతో కలిసి పరిశీలించారు. అలాగే పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్క జొన్న పైరులో కాండం తొలుచు పురుగును గుర్తించి నివారణ చర్యల గురించి వివరించారు. వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.
మిడుతూరు: నాసిరకం విత్తనాలు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ సహాయ సంచాలకులు విజయశేఖర్ హెచ్చ రించారు. చౌట్కూరు, 49 బన్నూరు గ్రామాల్లో వ్యవసాయ అధికారి పీరు నాయక్ ఆధ్వర్యంలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించారు. ఏఈవో మల్లికార్జున రెడ్డి, ఆర్‌ఎస్‌కే సిబ్బంది పాల్గొన్నారు.
ఆత్మకూరు రూరల్: రైతులు వ్యవసాయ అధికారుల సలహాలు, సూచ నల ప్రకారం యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించ వచ్చని ఏవో హేమలత రైతులకు సూచించారు. మండలంలోని వడ్లరా మాపురం, శ్రీపతిరావు పేట గ్రామాల్లో బుధవారం పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. ఏవో హేమలత రైతులతో మాట్లాడుతూ వరి, మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులకు యాజమాన్య పద్ధతుల గురించి విపులంగా వివ రించారు. అనంతరం ఉద్యానవన శాఖ అధికారిణి చందన మాట్లాడుతూ ఆ శాఖ ద్వారా అందే ప్రభుత్వ పథకాల గురించి వివరిం చారు. అనంతరం అక్కడ రైతులు సాగు చేసిన పామాయిల్ పంటలను పరిశీలించి రైతులకు సూచనలు చేశారు. ఉద్యానవన శాఖ ఫీల్డ్ మేనేజర్ ఫిరోజ్, ఎంపీఈవో రాజశేఖర్, రైతు సేవా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.
మహానంది: మండలంలో అరటి సాగు చేసే రైతులు జూలై 15 తేదీలోగా పంటకు బీమాను తప్పక చేసుకోవాలని ఏవో బి.నాగేశ్వరరెడ్డి తెలిపారు. బుధవారం మహానంది మండలం గాజులపల్లి, బసవాపురం గ్రామాల్లో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించారు. పశువైధ్యాధికారి శివానంద్, ఇన్సూరెన్స్ కంపెనీ జిల్లా కోఆర్డినేటర్ సునీల్, వ్యవసాయ విస్తరణాధికారి శ్రీనివాసరెడ్డి, పీల్డ్ కోఆర్డినేటర్ శశిధర్, సిబ్బంది పాల్గొన్నారు.