Share News

కలాం పాఠశాలకు సొంత భవనం నిర్మించాలి

ABN , Publish Date - Feb 26 , 2025 | 12:12 AM

విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు, ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డులు సొంతం చేసుకున్న ఏపీజే అబ్దుల్‌ కలాం మెమోరియల్‌ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలకు శాశ్వత భవనం నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభు త్వానికి విజ్ఞప్తి చేశారు.

కలాం పాఠశాలకు సొంత భవనం నిర్మించాలి
అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనం

ఆగిపోయిన పనులు

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తల్లిదండ్రుల విజ్ఞప్తి

కర్నూలు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్ర జ్యోతి): విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు, ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డులు సొంతం చేసుకున్న ఏపీజే అబ్దుల్‌ కలాం మెమోరియల్‌ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలకు శాశ్వత భవనం నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభు త్వానికి విజ్ఞప్తి చేశారు. 2021 నవంబరు 29వ తేదీన 46వ వార్డులో రూ.2కోట్లతో మేయర్‌ బీవై రామయ్య భవ నానికి శంకుస్థాపన చేశారు. దాదాపు నాలుగు సంవత్స రాలు గడచినా భవన నిర్మాణం చేపట్టలేదు. దీంతో విద్యార్థుల తల్లిదం డ్రులు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌ రంజిత్‌ బాషాకు ఫిర్యాదు చేశారు.

ఈ పాఠశాలలో 212 మంది విద్యా ర్థులు చదువుతు న్నారు. 2017 నుంచి 2024 వరకు రాష్ట్రంలో 100 శాతం విద్యార్థులు ఉత్తీర్ణుల య్యారు. ఎన్‌ఎంఎంఎస్‌ స్కాలర్‌షిప్‌కు 2024 వరకు 182 మంది ఎంపికయ్యారు. ప్రతిభ అవార్డులు కూడా అందుకున్నారు. ఆర్‌జీయూకే టీకి 36 మంది సెలెక్ట్‌ అయ్యారు. 2022, 2023, 2024 రాష్ట్ర స్థాయిలో బెస్ట్‌ స్కూల్‌ అవార్డులను సైతం కైవసం చేసుకున్నారు. ఏపీఆర్‌జేసీ పాలిటెక్నిక్‌ తదితర పోటీ పరీక్షలకు విద్యార్థులు ఎంపిక అవుతు న్నారు. అలాంటి పాఠశాలకు శాశ్వత భవనం లేదు.

పాఠశాల భవన నిర్మాణం పూర్తి చేయాలి

పాఠశాలకు కంప్యూటర్లను అందజేయాలని డీఈవో శ్యామూల్‌ పాల్‌ను అలాగే భవన నిర్మా ణాన్ని పూర్తిచేసి, వచ్చే విద్యాసం వత్సరం తరగతులను నిర్వహించేలా చూడాలని ముని ్సపల్‌ కమిషనర్‌ రవీంద్రబాబును ఆదేశించారు.

పేద విద్యార్థులకు న్యాయం చేయాలి

ఈ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యా యులు రాష్ట్ర, జిల్లా స్థాయిలో అవార్డు అందుకుం టున్నారు. భవనాన్ని త్వరగా నిర్మించాలి. ఈ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు అప్పుడే న్యాయం జరుగు తుంది. - సుధ, విద్యార్థి తల్లి

అధికారులు పట్టించుకోవడం లేదు

పాఠశాల భవన నిర్మాణం పూర్తి చేయాలని కోరుతూ నాలుగు నెలల క్రితం తల్లిదండ్రుల కమిటీ కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. కానీ అధికారులు పట్టించుకోలేదు. - రాజశేఖర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌, తల్లిదండ్రుల కమిటీ.

Updated Date - Feb 26 , 2025 | 12:12 AM