వేదవతి ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలి
ABN , Publish Date - Feb 25 , 2025 | 12:58 AM
అసెంబ్లీ బడ్జెట్ సమావేశశల్లో వేదవతి ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గిడ్డయ్య డిమాండ్ చేశారు.
సీపీఐ జిల్లా ప్రధాన కార్యదరి గిడ్డయ్య
ఆస్పరి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ బడ్జెట్ సమావేశశల్లో వేదవతి ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గిడ్డయ్య డిమాండ్ చేశారు. సోమవారం మాట్లాడుతూ రూ.వెయ్యి కోట్లు కేటాయించా లని, రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ఆలూరు ప్రజలు తాగునీటికి తుంగభద్ర దిగువ కాలువపై ఆధారపడ్డార్నారు. గూళ్యం సమీపంలో ప్రాజెక్టు ఎత్తిపోతల పథకాన్ని 8.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తే 80 వేల ఎకరాలకు సాగునీరు, 10 లక్షల మందిజుట తాగునీరు అందుం తుం దన్నారు. అనంతరం తాహసీ ల్దార్ రామేశ్వరరెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. విరుపాక్షి, కృష్ణమూర్తి బడే’్ఛబ్, బ్రహ్మయ్య, నల్లన్న, రామాంజిని, రంగప్ప, రామాంజిని పాల్గొన్నారు.
హోళగుంద: వేదవతి ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని సీపీఐ కార్యదర్శి మారెప్ప సోమవారం డిమాండ్ చేశారు. తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ నిజాముద్దీన్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.