మల్లన్న బ్రహ్మోత్సవాలకు రండి
ABN , Publish Date - Feb 17 , 2025 | 11:19 PM
శ్రీశైలంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలకు సీఎం నారా చంద్రబాబు నాయుడును శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆలయ ఈఓ ఎం.శ్రీనివాసరావుతో పాటు పండితులు ఆహ్వానించారు.

సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
శ్రీశైలం, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): శ్రీశైలంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలకు సీఎం నారా చంద్రబాబు నాయుడును శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆలయ ఈఓ ఎం.శ్రీనివాసరావుతో పాటు పండితులు ఆహ్వానించారు. సోమవారం అమరావతిలోని సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో వారు కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు ఆలయ పండితులు స్వామివారి ప్రసాదంతో పాటు చిత్రపటాన్ని అందజేసి ఆశీర్వదించారు. శ్రీశైల మహా క్షేత్రంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి.
గవర్నర్‌కు ఆహ్వానం : శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఆలయ అధికారులు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను సోమవారం కలిసి ఆహ్వానం పలికారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, పయ్యావుల కేశవ్‌ను కలిశారు.