Share News

చిన్నటేకూరు విద్యార్థులకు కలెక్టర్‌ అభినందన

ABN , Publish Date - Feb 13 , 2025 | 11:27 PM

చిన్నటేకూరు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఐఐటీ-మెడికల్‌ అకాడమిలో చదువుతున్న విద్యార్థులు, జేఈఈ-మెయిన్స్‌లో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా అభినందించారు.

చిన్నటేకూరు విద్యార్థులకు కలెక్టర్‌ అభినందన
విద్యార్థులను అభినందిస్తున్న కలెక్టర్‌

కర్నూలు ఎడ్యుకేషన్‌, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): చిన్నటేకూరు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఐఐటీ-మెడికల్‌ అకాడమిలో చదువుతున్న విద్యార్థులు, జేఈఈ-మెయిన్స్‌లో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా అభినందించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్‌లో డైరెక్టర్‌ ఉమామహేశ్వరప్ప ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టర్‌ను కలిశారు. ఆయన విద్యార్థులను అభినందించి సత్కరించారు. అకాడమీలోని గ్రామాల విద్యార్థులు ర్యాంకులు సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. త్వరలో కళాశాలను సందర్శించి విద్యార్థులు ఇంకా మెరుగైన ఫలితాలు సాధించడానికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో గురుకుల పాఠశాలల డీసీవో ఐ.శ్రీదేవి, అకడమిక్‌ డైరెక్టర్‌ ఉమామహేశ్వరప్ప, రిటైర్డ్‌ పీడీ చంద్రశేఖర్‌, అధ్యాపకులు ఉన్నారు.

Updated Date - Feb 13 , 2025 | 11:27 PM