మహిళా సంక్షేమానికి సీఎం కృషి
ABN , Publish Date - Dec 20 , 2025 | 12:04 AM
మహిళా శిశు సంక్షేమానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి అన్నారు.
మంత్రాలయం, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): మహిళా శిశు సంక్షేమానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి అన్నారు. మండలంలోని మాధవరంలోని తన నివాసంలో సీడీపీవో రాజేశ్వరీదేవి, సూపర్‌వైజర్లు భాగ్యలక్ష్మీబాయి, వీరగోవిందమ్మ, కాత్యాయిని, సుమిత్రమ్మ, అఖిల, విజయకుమారి ఆధ్వర్యంలో నియోజవర్గంలోని అంగన్‌వాడీలకు 251 సెల్‌ఫోన్లు పంపిణీ చేశారు. అనంతరం రాఘవేంద్ర రెడ్డిని అంగన్వాడీ కార్యకర్తలు శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మంచాల సింగిల్ విండో అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ రఘునాథ్ రెడ్డి, రాకేశ్‌రెడ్డి, రాజారెడ్డి, అంగన్‌వాడీ టీచర్లు లావణ్య, తులసమ్మ, నాగవేణి, భారతి, అనిత, నరసమ్మ, విశాలాక్షి, తాయమ్మ, మీనాక్షి, భాగ్యమ్మ, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.