Share News

పేదలకు వరం సీఎం రిలీఫ్‌ ఫండ్‌: ఎమ్మెల్యే

ABN , Publish Date - Sep 18 , 2025 | 12:56 AM

ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.

పేదలకు వరం సీఎం రిలీఫ్‌ ఫండ్‌: ఎమ్మెల్యే
తర్తూరులో చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే జయసూర్య

జూపాడుబంగ్లా, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. తర్తూరు, మండ్లెం, జూపాడుబంగ్లా, తాటిపాడు, పోతులపాడు, తరిగోపుల గ్రామాల్లో బుధవారం బాధితుల ఇంటిదగ్గరికి వెళ్లి చెక్కులను అందజేశారు. అనారోగ్యాలబారినపడి నిరుపేదలు ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందిన వారికి ప్రభుత్వం సీఎంఆర్‌ఎఫ్‌ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తుందని అన్నారు. తరిగోపులలో రత్నమ్మ, తర్తూరులో అరుణకుమారి, మండ్లెంలో నాగేంద్ర, పోతులపాడు సుంకమ్మ, తాటిపాడులో సిద్దిక్‌, ఉసేనయ్యగౌడు, జూపాడు బంగ్లాలో రమణకు మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి అందజేశారు. టీడీపీ మండల కన్వీనర్‌ మోహన్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి గిరీశ్వరరెడ్డి, యాదవ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లుయాదవ్‌, సొసైటీ చైర్మన్‌ శ్రీనివాసులు, కేసీ కాలువ చైర్మన్‌ పరమేశ్వరరెడ్డి, రమణారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, జంగాలపెద్దన్న, నారాయణ రెడ్డి, దొరబాబురెడ్డి, రవికాంత్‌, ప్రభాకర్‌రెడ్డి, లక్ష్మన్నగౌడు, లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 18 , 2025 | 12:56 AM