Share News

బీసీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా చిన్నరాముడు ప్రమాణం

ABN , Publish Date - Nov 03 , 2025 | 11:56 PM

నందవరానికి చెందిన టీడీపీ మండల మాజీ కన్వీనర్‌ దేవళ్ల చిన్నరాముడు సోమవారం విజయవాడలోని ఏపీ బీసీ కార్పోరేషన్‌ డైరెక్టర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.

బీసీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా చిన్నరాముడు ప్రమాణం
ప్రమాణ స్వీకారం చేసిన దేవళ్ల చిన్నరాముడు

నందవరం, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): నందవరానికి చెందిన టీడీపీ మండల మాజీ కన్వీనర్‌ దేవళ్ల చిన్నరాముడు సోమవారం విజయవాడలోని ఏపీ బీసీ కార్పోరేషన్‌ డైరెక్టర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల చిన్నరాముడును కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. దీంతో ఆయన బీసీ కార్పొరేషన్‌ కమిషనర్‌ సత్యనారాయణ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా చిన్నరాముడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌, ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డికి ధన్యావాదాలు తెలిపారు. కార్యక్రమంలో నందవరం పీఏసీఎస్‌ చైర్మన్‌ గోపాల్‌, నాయకుడు రామకృష్ణారెడ్డి ఉన్నారు.

Updated Date - Nov 03 , 2025 | 11:56 PM