Share News

డైస్‌ను పరిశీలించిన న్యాయాధికారి

ABN , Publish Date - Feb 07 , 2025 | 12:08 AM

ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని జిల్లా బాలల సత్వర చికిత్స కేంద్రం (డైస్‌)ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి, డీఎంహెచ్‌వో డా.పి. శాంతికళతో కలిసి పరిశీలించారు.

డైస్‌ను పరిశీలించిన న్యాయాధికారి
అధికారులతో మాట్లాడుతున్న లీలా వెంకటశేషాద్రి

కర్నూలు హాస్పిటల్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని జిల్లా బాలల సత్వర చికిత్స కేంద్రం (డైస్‌)ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి, డీఎంహెచ్‌వో డా.పి. శాంతికళతో కలిసి పరిశీలించారు. డీఎంహెచ్‌వో, ఆర్‌బీఎస్‌కే జిల్లా కో ఆర్డినేటర్‌ డా.కే. శైలేష్‌ కుమార్‌, మేనేజర్‌ షేక్‌ ఇర్ఫాన్‌ ు 0 నుంచి 18 సంవత్సరాల పిల్లలకు అందించే వైద్యసదుపా యాలను న్యాయమూర్తికి వివరించారు. కేంద్రంలో పుట్టుకతో లోపం ఉన్న చిన్నారులకు, చెవి, కంటి విటమిన్‌ మానసిక లోపం గల పిల్లలకు శిక్షణ పొందిన వైద్యులచే ఉచిత వైద్యం అందిస్తున్నామని డీఎంహెచ్‌వో వివరించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి మాట్లాడుతూ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు లీగల్‌ సర్వీసెస్‌, ఇంటింట సర్వే నిర్వహించడానికి న్యాయవాదులు, పారా లీగల్‌ వలంటీర్లు, ఆశా, ఏఎన్‌ఎంలు కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లతో టీమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఫిబ్రవరి 10 నుంచి 24వ తేదీ వరకు విభిన్న సామర్థ్యం గల పిల్లలను, ఆరోగ్య లోపాలు ఉన్న పిల్లలను గుర్తించి డైస్‌లో చికిత్సలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది కరుణజ్యోతి, పారా లీగల్‌ వలంటీర్లు డా. రాయపాటి శ్రీనివాసులు, సుధ, హేమంత్‌, చైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారులు జ్యోష్ణ లక్ష్మి, డెమో శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2025 | 12:08 AM