ఆటో డ్రైవర్లకు నగదు జమ
ABN , Publish Date - Oct 05 , 2025 | 12:35 AM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళలకు, రైతులకు, పారిశ్రామికవేత్తలకు, ఆటోడ్రైవర్‌లకు ఇలా అన్ని న్యాయం చేస్తూ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తోందని టీడీపీ మంత్రాలయం ఇన్‌చార్జి ఎన్.రాఘవేంద్రరెడ్డి అన్నారు.
మంత్రాలయం, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళలకు, రైతులకు, పారిశ్రామికవేత్తలకు, ఆటోడ్రైవర్‌లకు ఇలా అన్ని న్యాయం చేస్తూ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తోందని టీడీపీ మంత్రాలయం ఇన్‌చార్జి ఎన్.రాఘవేంద్రరెడ్డి అన్నారు. శనివారం మాధవరం నుంచి వందలాది ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం టీటీడీ కల్యాణ మంటపంలో ఆటోడ్రైవర్ సేవలో భాగంగా డీపీవో భాస్కర్, డీఎస్‌పీవో తిమ్మక్క, ఎంపీడీవో నూర్జహాన్, ఆర్టీవో రవీంద్రకుమార్ ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదలచేసి ఆటోడ్రైవర్‌లకు చెక్కును, డ్రైవర్‌లకు రూ.15వేలు బ్యాంకులో జమ అయిన సమాచారాన్ని చూపించారు. రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ కోసిగి 189 మంది, కౌతాళం 172 మంది, మంత్రాలయం 540 మంది, పెద్దకడబూరు 271 మంది, మొత్తం 1,172 మందికి రూ.15వేలు ప్రకారం రూ. 1,75,80,000 మంజూరయ్యాయని తెలిపారు. ఇంకారాని డ్రైవర్లు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారని చెప్పారు. కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప మాట్లాడుతూ సూపర్‌సిక్స్ సూపర్‌హిట్ కావడంతో ఓర్వలేక వైసీపీ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మంచాల సింగిల్ విండో అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, రాకేశ్‌రెడ్డి, ఎస్‌ఐ శివాంజల్, జిల్లా అధికార ప్రతినిధి చావిడి వెంకటేశ్, మాజీ జడ్పీటీసీ లక్ష్మయ్య, వరదరాజు, కంసాలి నరసింహ, సొసైటీ డైరెక్టర్లు డీసీ తిమ్మప్ప, చాపల నగేష్, పల్లిపాడు రామిరెడ్డి, ముత్తురెడ్డి, నర్సరెడ్డి, అయ్యన్న, టిప్పుసుల్తాన్, అడివప్పగౌడు, వెంకటపతిరాజు, అశోకరెడ్డి, ఉరుకుందు, బొజ్జప్ప, చాకలి రాఘవేంద్ర, విజయ్‌కుమార్, నరసింహులు పాల్గొన్నారు.
కౌతాళం: కూటమి ప్రభుత్వంతోనే ఆటో డ్రైవర్లు నిజమైన పండుగ జరుపుకుంటున్నారని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నబసప్ప అన్నారు. కౌతాళంలో శనివారం కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆటో డ్రైవర్ట సేవలో కార్యక్రమాన్ని ఆటో డ్రైవర్లతో కలిసి ఘనంగా నిర్వహించారు. ముందుగా జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నబసప్ప ఆటో డ్రైవర్లతో కలిసి సీఎం చిత్రపటానికి కౌతాళం ఆర్టీసీ బస్టాండ్ వద్ద క్షీరాభిషేకం చేశారు. తమ బాధలను గుర్తించి తమకు ఒక మంచి పథకాన్ని ప్రవేశ పెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూటమి నాయకులకు తాము రుణపడి ఉంటామని డ్రైవర్లు కిష్టప్ప, రాంపురం బాషా, మాబాషా అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాజబాబు, సిద్దు, సోమన్న, డింగి రఘరామ, డ్రైవర్లు కరీం, హజీ ఉన్నారు.
ఎమ్మిగనూరు: కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయంతో ఆటో డ్రైవర్లు ఆర్థికంగా బలపడాలని నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమణారెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని కుర్ణి కమ్యూనిటీ హాల్‌లో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించారు. ఆదోని ఎంవీఐ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ మల్లయ్య, టీడీపీ నాయకులు భాస్కర్ల చంద్రశేఖర్ హాజరయ్యారు. అంతకు ముందు స్థానిక మార్కెట్ కమిటీ నుంచి టీడీపీ నాయకులు భాస్కర్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వందలాది ఆటోలతో పట్టణంలో భారీర్యాగా కుర్ణి కమ్యూనిటీ హాల్‌కు చేరుకున్నారు. హాల్ దగ్గర సీఎం చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం టీడీపీ నాయకులు చంద్రశేఖర్, మాచాని మహేశ్, బీజేపీ నాయకులు నరసింహులు మాట్లాడుతూ నియోజకవర్గంలోని 1206మంది ఆటో డ్రైవర్లకు రూ. 15వేల చొప్పున రూ. 1.81 కోట్లు వారి ఖాతాల్లో జమ అయ్యాయని తెలిపారు. అనంతరం అధికారులు, నాయకులు ఆటో డ్రైవర్లకు చెక్కును అందజేశారు. ఆయా మండలాల అధికారులు, టీడీపీ నాయకులు కాశీంవలి, వెంకట్రామిరెడ్డి, చిన్నరాముడు, ధర్మాపురం గోపాల్, మహేంద్ర బాబు, తిరుపతయ్య నాయుడు, ఎన్వీ రామాంజనేయులు, కలీముల్లా, రంగస్వామి గౌడ్, బుగిడే నాగరాజు, షాలేమ్, సోగనూరు జగదీశ్, నరసప్ప పాల్గొన్నారు.
నందవరం: ఇచ్చిన హమీలను నెరవేర్చడంలో రాష్ట్రంలోనే కూటమి ప్రభుత్వం టాప్‌గా నిలిచిందని టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు ఈరన్నగౌడు, చేనేత సొసైటీ కార్పొరేషన్ డైరెక్టర్ డీవీ రాముడు అన్నారు. శనివారం నందవరం, ముగతి, సోమలగూడూరు, ధర్మాపురం తదితర గ్రామాల నుంచి ఆటోల డ్రైవర్లతో కలిసి ఎమ్మిగనూరు మార్కెట్ యార్డుకు ర్యాలీగా వెళ్లారు. టీడీపీ నాయకులు, ముగతి భార్గవ్‌యాదవ్, నందవరంలో టీడీపీ బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్దరాముడు, మస్తాన్, బోయ కడుబూరి, కొండయ్య, మోడల్ స్కూల్ మేనేజ్‌మెంట్ చైర్మన్ రవి పాల్గొన్నారు.
కోసిగి: ప్రభుత్వం ఆటో డ్రైవర ఖాతాలో రూ.15వేలు జమ చేయడంతో ఆటో డ్రైవర్లు కృతజ్ఞతలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు. కోసిగికి చెందిన జానకల్ మురళీకృష్ణ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని ఏడాదికి రూ.15వేలు ఇవ్వడం చాల సంతోషించదగ్గ విషయమన్నారు. నరసింహులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో పెండింగ్ కంతులను కటుకుంటానని చెప్పారు. బాబు మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న ఆటో డ్రైవర్‌లను ఆదుకోవాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబురూ.15వేలు ఇచ్చారని, కూటమి ప్రభుత్వానికి ఆటో డ్రైవర్లు అండగా ఉంటామని అన్నారు.