స్థలాలు ఆక్రమించిన వారిపై కేసులు
ABN , Publish Date - May 15 , 2025 | 12:28 AM
ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకున్న వారిపై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేసి కేసులు నమోదు చేయించాలని ఆర్డీవో నాగజ్యోతి అధికారులను ఆదేశించారు.
జూపాడుబంగ్లా, మే 14(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకున్న వారిపై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేసి కేసులు నమోదు చేయించాలని ఆర్డీవో నాగజ్యోతి అధికారులను ఆదేశించారు. జూపాడు బంగ్లాలో తంగడంచ విత్తనోత్పత్తి క్షేత్రానికి సంబంధించిన భూములు ఆక్రమణకు గురైనట్లు వ్యవసాయశాఖ అధికారులు ఫిర్యాదు చేయ డంతో ఆక్రమణకు గురైన స్థలాలను పరిశీలించారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకునే సమయంలో స్థలాల్లో దిగిన ఎక్సకవేటర్ యజమా నులపై చర్యలు తీసుకుని యంత్రాన్ని సీజ్ చేయాలని తహసీల్దార్ చంద్రశేఖర్‌నాయక్‌ను ఆదేశించారు. ఆక్రమించుకున్న స్థలాల వద్ద ప్రభుత్వ స్థలంగా బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. తంగడంచలో ఏర్పాటు చేసిన జైన్ పరిశ్రమను పరిశీలించారు. జైన్ పరిశ్రమ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఏమేమీ ఉత్పత్తులు చేశారని కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. మౌలిక సదుపాయాలు నీటిసరఫరా చేస్తే పరిశ్రమను ముందుకు తీసుకెళుతామని ఆర్డీవోకు వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో గోపికృష్ణ, ఉప తహసీల్దార్లు సత్యదీప్, నాగన్న, వీఆర్వోలు పాల్గొన్నారు.