రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ABN , Publish Date - Feb 07 , 2025 | 12:05 AM
కర్నూలు- చిత్తూరు జాతీయ రహదారి-40పై గురువారం సాయంత్రం ఓర్వకల్లు గ్రామ సమీపాన గల పవర్ గ్రిడ్ ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో 8 మందికి గాయాలయ్యాయి.

8 మందికి గాయాలు ఫ రాంగ్ రూట్‌లో వస్తున్న ట్రాక్టర్‌ను తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టిన కారు
ఓర్వకల్లు, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): కర్నూలు- చిత్తూరు జాతీయ రహదారి-40పై గురువారం సాయంత్రం ఓర్వకల్లు గ్రామ సమీపాన గల పవర్ గ్రిడ్ ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో 8 మందికి గాయాలయ్యాయి. కర్ణాటక రాష్ట్రం రాయచూరు చెందిన 12 మంది కుటుంబ సభ్యులు తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని స్వగ్రామానికి వెళ్తుండగా.. ఓర్వకల్లు పవర్‌గ్రిడ్ వద్ద రాంగ్ రూట్‌లో వస్తున్న ట్రాక్టర్‌ను తప్పించబోయి కారు డీవైడర్‌ను ఢీకొట్టింది. కారులో ఉన్న జానకి (60) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. చిన్నారి నిహారిక (4) ఓర్వకల్లు పీహెచ్‌సీలో చికిత్స పొందుతూ మృతి చెందింది. తండాకు చెందిన శ్రీనివాస్ నాయక్ తన వాహనంలో బాలికను సీహెచ్‌సీ తీసుకెళ్లగా అప్పటికే చిన్నారి మృతి చెందిందని వైద్యులు నిర్ధ్దారించారు. ప్రమాదం జరగ్గానే కర్నూలు రూరల్ సీఐ చంద్రబాబు నాయుడు ఎస్‌ఐ సునీల్ కుమార్ సందర్శించి క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వాసుప త్రికి తరలించారు. కారులో 12 మంది ఉండగా.. అందులో ఇద్దరు మృతి చెందారు. కర్నూలు ప్రభుత్వ ఆసుప త్రిలో నలుగురు, ఓర్వకల్లు సీహెచ్‌సీలో నలుగురు చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సునీల్‌కుమార్ తెలిపారు.