Share News

చెరువును ఆక్రమించుకుంటున్నా కనిపించదా?

ABN , Publish Date - Jan 17 , 2025 | 11:38 PM

చెరువు ఆక్రమణలకు గురవుతుంటే అధికారులకు కనిపిం చలేదా? అని ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి మండిప డ్డారు

చెరువును ఆక్రమించుకుంటున్నా కనిపించదా?
చెరువును పరిశీలిస్తున్న ఎమ్మెల్యే విరుపాక్షి, మాట్లాడుతున్న టీడీపీ ఇన్‌చార్జి వీరభద్ర గౌడ్‌

ఆలూరు, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): చెరువు ఆక్రమణలకు గురవుతుంటే అధికారులకు కనిపిం చలేదా? అని ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి మండిప డ్డారు. శుక్రవారం ఆక్రమణకు గురైన చెరువును పరిశీలించారు. చెరువు ప్రజల ఆస్తి అని కాపాడు కునే బాధ్యత కూడా మనదే అన్నారు. చెరువులో రాళ్ళు పాతుతుంటే రెవెన్యూ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, ఇందులో మీరు ఎంత తీసుకున్నారని ప్రశ్నిం చారు. అధికారులపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఇక మీదట చెరువు నుంచి అనాధికారికంగా గ్రావెల్‌ను తరలిస్తే సహించబోమ న్నారు. వైసీపీ నాయకులు చిన్న ఈరన్న, గిరి, మాజీ ఎంపీటీసీలు భాస్కర్‌, పెట్రోల్‌ బంక్‌ కిషోర్‌, మండల నాటకులు అరికెర వెంకటేష్‌, వీరేష్‌, ఊరుకుందు, ఎల్లప్ప బాబు పాల్గొన్నారు.

ఆక్రమించేవారు ఏ పార్టీవారైనా ఉపేక్షించం

]చెరువును ఆక్రమించే వారు ఏ పార్టీవారైనా ఉపేక్షించబోమని టీడీపీ ఇన్‌చార్జి వీరభద్ర గౌడ్‌ అన్నారు. శుక్రవారం మాట్లాడుతూ ఆలూరు చెరువును అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. సమ్మర్‌ స్టోరేజీ ట్యాంక్‌ నిర్మించి ప్రజల దాహార్తిని తీరుస్తామన్నారు. చెరువును ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకో వాలని కలెక్టర్‌, రెవెన్యూ, మైనర్‌ ఇరిగేషన్‌ అధికారులను కోరామని, సంరక్షించాలని సూచించామని తెలిపారు.

Updated Date - Jan 17 , 2025 | 11:38 PM