Share News

ఇంటి స్థలాలకు బడ్జెట్‌ కేటాయించాలి

ABN , Publish Date - Mar 06 , 2025 | 12:16 AM

రాష్ట్ర బడ్జెట్‌లో గృహ నిర్మాణ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి నిధులు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే. రామక్రిష్ణ అన్నారు.

ఇంటి స్థలాలకు బడ్జెట్‌ కేటాయించాలి
మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామక్రిష్ణ

కర్నూలు న్యూసిటీ, మార్చి 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర బడ్జెట్‌లో గృహ నిర్మాణ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి నిధులు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే. రామక్రిష్ణ అన్నారు. బుధవారం సీఆర్‌ భవన్‌లో జరిగిన సీపీఐ జిల్లా కార్యవర్గసమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల ముందు ప్రతిపక్షంలో ఉన్న కూటమి ప్రభుత్వం పేదప్రజల సొంత ఇంటికలను నెరవేరుస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అర్హులైన పేదల ప్రజలందరికీ గ్రామీణ ప్రాంతాల్లో మూడు, పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్ల స్థలం ఇచ్చి నాలుగు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జిల్లా అభివృద్ధి చెందాలంటే పెండింగ్‌ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయడం కోసం నిదులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యు లు పి. రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు ఆవుల శేఖర్‌, లెనిన్‌బాబు, జిల్లా సహాయ కార్యదర్శి మునెప్ప పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2025 | 12:16 AM