Share News

మెరుగైన సేవలు అందించాలి: కలెక్టర్‌

ABN , Publish Date - Dec 12 , 2025 | 12:12 AM

ప్రభుత్వం అందిస్తున్న సర్వీస్‌ల మెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు.

 మెరుగైన సేవలు అందించాలి: కలెక్టర్‌
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌, అధికారులు

నంద్యాల నూనెపల్లి, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అందిస్తున్న సర్వీస్‌ల మెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు. గురువారం ఏపీ సచివాలయంలోని సీఎస్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రజా సానుకూల అవగాహన పెంపు, ఏజెంట్‌ స్పేస్‌ కోసం డాక్యుమెంట్‌ అప్‌లోడ్‌, సేవల విజిబిలిటీ వంటి పలు కీలక అంశాలపై సమీక్ష జరిగింది. కలెక్టర్‌ రాజకుమారి మాట్లాడుతూ సేవల నాణ్యత, ప్రజలకు అందుతున్న ఫలితాలు, ఫిర్యాదుల పరిష్కారం, పారదర్శక వ్యవస్థ వంటి అంశాలలో ఏ పారామీటర్‌లోను జిల్లా దిగువ స్థానంలో లేకుండా సమర్థవంతంగా పని చూయాలని సూచించారు. ప్రతి శాఖ ప్రజలకు చేరువ కావాలని సమస్యలు పరిష్కరించే విధానాన్ని అమలు చేయాలన్నారు. ఉత్తమ ప్రాక్టీస్‌ల ఆధారంగా జిల్లాలో చేపడుతున్న అబివృద్ధి చర్యలను విజయగాధల రూపంలో రూపొందించే పనిపై శాఖాధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ కార్తీక్‌, డీఆర్వో రామునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 12 , 2025 | 12:12 AM