Share News

గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి

ABN , Publish Date - Jun 26 , 2025 | 01:12 AM

గిరిజన గూడేల్లోని గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్‌వో వెంకటరమణ సూచించారు.

గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి
అవగాహన కల్పిస్తున్న డీఎంహెచ్‌వో వెంకటరమణ

వెలుగోడు, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): గిరిజన గూడేల్లోని గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్‌వో వెంకటరమణ సూచించారు. పట్టణంలోని విజయదుర్గ, జగనన్న కాలనీ వద్ద ఉన్న చెంచు కాలనీలను బుధవారం ఆయన సందర్శించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ గిరిజనతండాల్లో గిరిజనులకు రక్తహీనత రాకుండా వైద్యులు సేవలు అందించాలన్నారు. గిరిజన ప్రభావిత ప్రాంతాలలో సికెల్‌ సెల్‌ ఎనీమియా వ్యాధి సోకకుండా అవగాహన కల్పించాలన్నారు. వైద్యాధికారులు ప్రసన్నలక్ష్మి, సుధా ప్రణిత, సీహచ్‌వో నాగేశ్వరరావు, సిబ్బంది మధుసూదన్‌, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 26 , 2025 | 01:12 AM