Share News

నడి రోడ్డుపై గేదెలు

ABN , Publish Date - Feb 07 , 2025 | 11:50 PM

గేదెల యజమానులకు కోపం రావడంతో ఆ పశువులను జాతీయ రహదారిపై అడ్డంగా వదిలి నిరసన వ్యక్తం చేసిన సంఘటన జూపాడుబంగ్లా మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది.

నడి రోడ్డుపై గేదెలు
జూపాడుబంగ్లా కేసీకాల్వ వంతెనపై అడ్డుగా ఉన్న గేదెలు

జూపాడుబంగ్లా, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): గేదెల యజమానులకు కోపం రావడంతో ఆ పశువులను జాతీయ రహదారిపై అడ్డంగా వదిలి నిరసన వ్యక్తం చేసిన సంఘటన జూపాడుబంగ్లా మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. జూపాడుబంగ్లాకు గేదెలను కేసీకాల్వ ఆయకట్టుకింద పంటల నూర్పిడి అనంతరం మేతకోసం ఎన్నోఏళ్ల నుంచి గేదెల యజమానులు మేపుకుంటున్నారు. వారం రోజుల నుంచి 80బన్నూరు పొలిమేరలోకి పశువులు రాకూడదని గ్రామస్థులు చెప్పారంటూ కావలిదారు అడ్డుకుంటున్నారు. శుక్రవారం కూడా అదే తరహాలో అడ్డుకుంటే పశువుల యజమానులంతా తిరగబడ్డారు. కేసీకాల్వ వంతెనపై అడ్డుకోవడంతో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు అరగంట పాటు తీవ్రఅంతరాయం కలిగింది. ఈ సమయంలో ఓ వాహనం గేదెలను ఢీకొనడంతో ఓ గేదెకు కాలు విరిగింది. అనంతరం పశువుల యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారిస్తున్నట్లు ఎస్‌ఐ లక్ష్మినారాయణ వెల్లడించారు.

Updated Date - Feb 07 , 2025 | 11:50 PM