Share News

రమణీయం.. గంగాభవాని రథోత్సవం

ABN , Publish Date - Mar 05 , 2025 | 12:46 AM

మండలంలోని బాపురం లో వెలసిన గంగాభవాని జాతర సందర్భంగా బసలింగమ్మవ్వ ఆశీస్సుల తో రథోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి.

రమణీయం.. గంగాభవాని రథోత్సవం
రథోత్సవానికి హాజరైన భక్తులు

పెద్దకడుబూరు, మార్చి 4(ఆంధ్రజ్యోతి): మండలంలోని బాపురం లో వెలసిన గంగాభవాని జాతర సందర్భంగా బసలింగమ్మవ్వ ఆశీస్సుల తో రథోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం అశేష జనవాహిని మధ్య అమ్మవారిని రథంపై ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథాన్ని ముందుకు లాగారు. కర్ణాటక, ఆంధ్ర భక్తులు పాల్గొని తమమొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు రామకృష్ణారెడ్డి, రమాకాంతరెడ్డి, బసలదోడ్డిఈరన్న, వీరేష్‌ గౌడ్‌, మీసేవ నరసప్ప, సిద్దప్పగౌడ్‌, భక్తులు పాల్గొన్నారు.

హోరాహోరీగా కబడ్డీ పోటీలు: గంగభవాని జాతర మహోత్సవం సందర్భంగా నిర్వహించిన కబడ్డీ పోటీల ఫైనల్‌ మ్యాచలో గోనెగండ్ల, బాపురం జట్లు మధ్య హోరాహోరీగా సాగింది. గోనెగండ్ల జట్టు విజయం సాధించగా రూ. 20,016లను మంత్రాలయం టీడీపీ నాయ కుడు రామకృష్ణ రెడ్డి అందజేశారు. రెండవ బహుమతి బాపురం జట్టుకు రూ 15,016లను, అలసందుగుత్తి జట్టుకు రూ 10,016లను అందజేశారు. కార్యక్రమంలో ఆర్గనైజర్లు గణేష్‌, అంజి, మహదేవ, వీరేష్‌ గౌడ్‌, నరసప్ప, హనుమంతు పాల్గొన్నారు.

ఎమ్మిగనూరు రూరల్‌: మండలంలోని ఎర్రకోట గ్రామంలో రామ లింగేశ్వరస్వామి మహారథోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహిం చారు. ఉదయం నుంచి స్వామివారికి ఆలయ అర్చ కులు జలాభిషేకం, బిల్వాభిషేకం, పుష్పాభిషేకం, మహామంగళహారతి నిర్వహించారు. సాయంత్రం అశేష భక్తజనుల మధ్య రథాన్ని లాగారు.

Updated Date - Mar 05 , 2025 | 12:46 AM