సీజన్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Jun 06 , 2025 | 12:15 AM
సీజన్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో డాక్టర్ ఆర్.వెంకటరమణ అన్నారు.
నంద్యాల హాస్పిటల్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): సీజన్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో డాక్టర్ ఆర్.వెంకటరమణ అన్నారు. గురువారం జీజీహెచ్‌లోని ఎంసీహెచ్ బ్లాక్‌లో నంద్యాల జిల్లా సబ్ యూనిట్ అధికారులు, ఆరోగ్యకార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం జూన్‌లో నిర్వహించే మలేరియా వ్యతిరేక మాసోత్సవ సందర్భంగా సీజనల్ వ్యాధులపై అవగాహన పెంచేందుకు ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దోమల నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. అనారోగ్యం బారిన పడితే వైద్యులను సంప్రదించాలని సూచించారు. జిల్లా మలేరియా అధికారి కామేశ్వరరావు, సహాయ మలేరియా అధికారి రామవిజయరెడ్డి, జిల్లాలోని సబ్ యూనిట్ అధికారులు, ఆరోగ్యకార్యకర్తలు పాల్గొన్నారు.