Share News

కుష్ఠు వ్యాధితో అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Nov 28 , 2025 | 12:03 AM

కుష్ఠు వ్యాధితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర కుష్ఠు వ్యాధి నిర్మూణ బృందం సభ్యులు శాంతరామ్‌, రీతీతేశ్వరి, మనీష, రాష్ట్ర కుష్ఠు వ్యాధి నిర్మూలన జాయింట్‌ డైరెక్టర్‌ దేవసాగర్‌ సత్యవతి సూచించారు.

కుష్ఠు వ్యాధితో అప్రమత్తంగా ఉండాలి
గోనెగండ్లలో రికార్డులను పరిశీలిస్తున్న కేంద్ర కుష్ఠు వ్యాధి నిర్మూలన బృందం సభ్యులు

గోనెగండ్ల, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): కుష్ఠు వ్యాధితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర కుష్ఠు వ్యాధి నిర్మూణ బృందం సభ్యులు శాంతరామ్‌, రీతీతేశ్వరి, మనీష, రాష్ట్ర కుష్ఠు వ్యాధి నిర్మూలన జాయింట్‌ డైరెక్టర్‌ దేవసాగర్‌ సత్యవతి సూచించారు. గోనెగండ్లలో ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం కుష్ఠు వ్యాధి నిర్మూలన బృందం తనిఖీ చేశారు. రికార్డుల ను పరిశీలించారు. మండలంలో కుష్ఠు వ్యాఽధిగ్రస్థుల గుర్తింపు సర్వే ఎలా జరుగుతుందో తెలుసుకున్నారు. నవంబరు 30వ తేది వరకు ఈ ఇంటింట సర్వే నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సర్వే మండలంలో ఎలా జరుగుతుందని వైద్యురాలు రంగరవళిని అడిగి తెలుసుకున్నారు. కుష్ఠు వ్యాధి సోకిన వ్యక్తిని వారు పరిశీలించారు. వారు మట్లాడుతూ చర్మం పై స్పర్శలేక పోవడ రాగి రంగు గల మచ్చలు, చర్మము పొడిగా ఉండటం, కనురెప్పలపై ఉన్న వెంట్రుకలు రాలిపోవడం, కన్నులు మూత పడక పోవడం, చర్మం మందం కావడం, అరచేతులు, కాళ్లు బొబ్బలు రావడం, చేతి వేళ్లు, కాలివేళ్లు వంకర పోవడం వంచి లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఉచితంగా మందులు ఇస్తారని తెలిపారు. పలు ఆరోగ్య సూత్రల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2025 | 12:04 AM