చట్టాలపై అవగాహన కల్పించాలి
ABN , Publish Date - May 08 , 2025 | 12:10 AM
అసంఘటిత కార్మికులకు చట్టాలపై అవగాహన కల్పించాలని నందికొట్కూరు సీనియర్ సివిల్ న్యాయాధికారి శోభారాణి పోలీసులు, కార్మికశాఖ అధికారులకు సూచిం చారు.
నందికొట్కూరు, మే 7(ఆంధ్రజ్యోతి): అసంఘటిత కార్మికులకు చట్టాలపై అవగాహన కల్పించాలని నందికొట్కూరు సీనియర్ సివిల్ న్యాయాధికారి శోభారాణి పోలీసులు, కార్మికశాఖ అధికారులకు సూచిం చారు. బుధవారం నందికొట్కూరు కోర్టు ఆవరణలో ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మికుల దినత్సవం సం దర్భంగా న్యాయాధికారి న్యాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిం చారు. అసంఘటిత కార్మికుల హక్కులు, చట్టాలు సామాజిక భద్రతా చట్టం 2008లోని అంశాలు, కనీస వేతనం తదితరు అంశాల గురించి వివరించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం, కార్మికశాఖ అధికారులు పాల్గొన్నారు.