చట్టాలపై అవగాహన పెంచుకోవాలి: డీఎస్పీ
ABN , Publish Date - Jan 30 , 2025 | 01:02 AM
చట్టాలపై ప్రజలు అవగా హన పెంచుకోవాలని డీఎస్పీ ఉపేంద్రబాబు సూచించారు.

నందవరం, జనవరి 29(ఆంధ్రజ్యోతి): చట్టాలపై ప్రజలు అవగా హన పెంచుకోవాలని డీఎస్పీ ఉపేంద్రబాబు సూచించారు. బుధవారం మండలంలోని హాలహర్విలో ఎస్‌ఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. డీఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో చిన్న సమ స్యలను పెద్దవి చేసుకుని ఘర్షణలకు పడరాదని సూచించారు. భూత గాదాలు ఉంటే అధికారులను సంప్రదించి పరిష్కరించుకోవాల న్నారు. యువత ఆనలైన జాబ్‌లను నమ్మి మోసపోవద్దన్నారు. సైబర్ క్రైమ్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసేలా వివరించారు. గ్రామాల్లో బాల్య వివాహాలను అరికట్టాల్సి బాధ్యత గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. గ్రామాల్లో ఎలాంటి విషయాలు చోటు చేసుకున్న మొద ట పోలీస్ స్టేషనలో ఫిర్యాదు చేస్తే సగం సమస్యలు పరిష్కారమవు తాయన్నారు. సమావేశంలో పోలీసులు పాల్గొన్నారు.