Share News

‘హిందువులపై దాడులు సరికాదు’

ABN , Publish Date - Mar 11 , 2025 | 12:58 AM

హిందువులపై దాడులు సరికాదని హిందూ సంఘాల నాయకులు అన్నారు.

‘హిందువులపై దాడులు సరికాదు’
ర్యాలీ చేస్తున్న హిందూ సంఘాల నాయకులు

నంద్యాల కల్చరల్‌, మార్చి 10(ఆంధ్రజ్యోతి): హిందువులపై దాడులు సరికాదని హిందూ సంఘాల నాయకులు అన్నారు. రాయచోటిలో హిందువులపై జరిగిన దాడులు, అక్రమ అరెస్టులకు నిరసనగా సోమవారం వీహెచ్‌పీ ఆధ్వర్యంలో నంద్యాలలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వీహెచ్‌పీ, బీజేపీ, ధార్మిక సంఘాలు, దేవాలయ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ టెక్కె వీహెచ్‌పీ కార్యాలయం నుంచి శ్రీనివాససెంటర్‌ , వివేకానంద సెంటర్‌, గాంధీ చౌక్‌ మీదుగా నిర్వహించి కలెక్టర్‌ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బసవన్నగుడి నుంచి శ్రీనివాససెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు బుగ్గన చంద్రమౌళీశ్వరరెడ్డి మాట్లాడుతూ అక్రమ కేసులు పెట్టిన హిందూ భక్తులను వెంటనే విడుదల చేయాలి. వీరభద్రస్వామి పార్వేట ఉత్సవాల్లో హిందూ భక్తులపై దాడి చేసి మహిళలు, పిల్లలు అని చూడకుండా విచక్షణా రహితంగా కొట్టిన ఎస్‌ఐని వెంటనే సస్పెండ్‌ చేయాలన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు మాట్లాడుతూ హిందువులు అందరూ అందరిని సమానంగా చూడటం వల్ల చేతకాని తనంగా భావించడం అవివేకమని అన్నారు. విశ్వహిందూ పరిషత్‌ రాష్ట్ర బజరంగ్‌దళ్‌ సంయోజక్‌ పోలేపల్లి సందీప్‌, జిల్లా కార్యదర్శి కిషోర్‌ కుమార్‌, కమ్మయ్య, నాగరాజు, విశ్వనాథ్‌రెడ్డి, రామాంజనేయులు, బీజేపీ నాయకులు మేడా మురళీధర్‌, నిమ్మకాయల సుధాకర్‌, బసవరాజు, హిందువులు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2025 | 12:58 AM