Share News

ఆత్మకూరు ఎంవీఐ దాతృత్వం

ABN , Publish Date - Sep 18 , 2025 | 12:54 AM

ఆత్మకూరు మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.సత్యనారాయణ రెడ్డి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.

ఆత్మకూరు ఎంవీఐ దాతృత్వం
గిరిజన డ్రైవర్లతో ఆత్మకూరు ఎంవీఐ ఏఎస్‌ఎన్‌ రెడ్డి

ఆత్మకూరు, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): ఆత్మకూరు మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.సత్యనారాయణ రెడ్డి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. మండలంలోని పెచ్చెర్వు, కొట్టాలచెరువు చెంచుగూడేలకు చెందిన గిరిజన డ్రైవర్లకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ మంజూరు చేయడం కోసం ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వాస్తవానికి ఆయా గూడేలకు చెందిన సుమారు 60 మంది గిరిజన ఆటో, ఇతర వాహనాల డ్రైవర్లకు డ్రైవింగ్‌ లైసెన్స్‌లు లేవు. సుమారు రూ.80వేలకు పైగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ చలానా ఖర్చులను ఎంవీఐ భరాయించి గిరిజన డ్రైవర్లందరికి లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేయించారు. అంతేకాదు.. వారందరిని బుధవారం కరివేన సమీపంలోని ఎంవీఐ కార్యాలయానికి పిలిపించి ఎల్‌ఎల్‌ఆర్‌ పత్రాలను వారికి అందజేశారు. నెలలోగా అందరికీ డ్రైవింగ్‌ లైసెన్స్‌లు ఇస్తామని భరోసా ఇచ్చారు. అలాగే అక్కడికి వచ్చిన గిరిజన ఆటో డ్రైవర్లందరికి మర్యాదపూర్వకంగా మధ్యాహ్న భోజనాన్ని సమకూర్చారు.

Updated Date - Sep 18 , 2025 | 12:54 AM