Share News

దేశ పురోగతికి అంబేడ్కర్‌ ఆశయాలే స్ఫూర్తి

ABN , Publish Date - Feb 13 , 2025 | 12:49 AM

దేశ పురోగతికి అంబేద్కర్‌ ఆశయాలు స్ఫూర్తి అని సమాజ్‌వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాశం వెంకటేశ్వర్లు అన్నారు.

దేశ పురోగతికి అంబేడ్కర్‌ ఆశయాలే స్ఫూర్తి
మాట్లాడుతున్న పాశం వెంకటేశ్వర్లు

సమాజ్‌వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాశం వెంకటేశ్వర్లు

కర్నూలు కల్చరల్‌, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): దేశ పురోగతికి అంబేద్కర్‌ ఆశయాలు స్ఫూర్తి అని సమాజ్‌వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాశం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం నగరంలోని శంకరాస్‌ డిగ్రీ కళాశాల్లో, సమాజ్‌వాది పార్టీ ఆధ్వర్యంలో ‘అంబేద్కర్‌ ఆశయం - బహుజన భారతం’ అనే అంశంపై రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహిం చారు. సమాజ్‌వాది పార్టీ రాయలసీమ జోన కన్వీనర్‌ సిద్దపు పాండు రంగ యాదవ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఽఘం జాతీయ కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, ఎస్సీ ఎస్టీ లాయర్స్‌ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు వైద్యరాజు, సమాజ్‌వాది పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు పెరుగు శివకృష్ణయాదవ్‌, రాష్ట్ర యువజన నాయకుడు కల్యాణ్‌కుమార్‌, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి షేక్‌ ఫరీదాబీ, యాదవ చైతన్య సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కంది వరుణ్‌ కుమార్‌ యాదవ్‌, నాయకులు సింధు నాగేశ్వరరావు యాదవ్‌ పాల్గొ న్నారు. ఈ సందర్భంగా పాశం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశం పురో గతి సాధించిందంటే అందుకు అంబేద్కర్‌ సూచించిన అంశాలే కారణ మని చెప్పారు. బహుజన, దళిత సంఘాల నాయకులు, ఫాసిజాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీలు ఐకమత్యంగా ఉండాలని అన్నారు.

Updated Date - Feb 13 , 2025 | 12:49 AM