హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న కూటమి
ABN , Publish Date - Jan 25 , 2025 | 11:53 PM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తుం దని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే విరుపాక్షి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు.

వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే విరుపాక్షి
ఆలూరు, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తుం దని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే విరుపాక్షి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు. హత్యకు గురైన ఫీల్డ్ అసిస్టెంట్ బండారి ఈరన్న కుటుంబ సభ్యలను శనివారం పరామర్శించారు. సీఎం చంద్రబాబు, కుమారుడు లోకేష్ దావోస్‌లో రెడ్‌బుక్ అమలు చేస్తామని చెప్పడం హత్య రాజకీయాలను ప్రోత్సహించడానికేన న్నారు. అభివృద్ధిని పక్కన పెట్టి వైసీపీ నాయకులను ఊచకోతకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం కోసం అధికార పార్టీ నాయకుల ప్రోత్సాహంతోనే ఈ హత్య జరిగిందని ఆరోపించారు. హత్యకు కారకులైన వారిని తక్షణమే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులను చేతగాని వారిగా చూస్తే, అధికార పార్టీ నాయకులపై ఎదురుదాడి చేస్తామని హెచ్చరించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవరించకుండా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కురువ శశికళ కృష్ణమోహన్, జడ్పీటీసీ కిట్టు, వైసీపీ నాయకులు జనార్దన్ నాయుడు, నాగప్ప, గోవర్దన్, వీరేశ్, ఓబులేసు, గిరి, కిషోర్, నాగేంద్ర, నాగరాజు పాల్గొన్నారు.
హత్యా రాజకీయాలు టీడీపీ ప్రోత్సహించదు
సీఎంపై ఎమ్మెల్యే ఆరోపణలు సరికాదు
టీడీపీ ఇన్‌చార్జి వీరభద్ర గౌడ్
ఆలూరు, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): హత్యా రాజకీయాలను టీడీపీ ప్రోత్సహిందని, అవి తమ నైజం కాదని, అరికెర ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్న హత్య బాధాకరమని ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి వీరభద్రగౌడ్, యువ నాయకుడు గిరి మల్లేష్ గౌడ్ అన్నారు. శనివారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడు తూ, టీడీపీ బీసీల పార్టీ అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్నను హత్య చేసిన వారిని ఊపేక్షించవద్దని పోలీసులకు సూచించామన్నారు. ఎమ్మెల్యే విరుపాక్షి సీఎం చంద్రబాబు, తనపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రజాసేవ చేయడానికే వచ్చామని, హత్యా రాజకీయాలు చేయడానికి రాలేద న్నారు. హత్యకు గురైన ఈరన్నకు టీడీపీ నాయకులు సంతాపం ప్రక టించారన్నారు. రాంనాథ్ యాదవ్, కిష్టప్ప, కన్వీనర్ అశోక్, రఘు, ప్రసాద్‌రెడ్డి, అట్టేకల్ జగన్ మోహన్, బాబు, తిమ్మయ్య, రవి యాదవ్, రంగన్న, సుభాన్, రాముడు, మల్లన్న, నరసప్ప, మసాల జగన్, నారాయణ, సురేంద్ర కొమ్ము రామాంజనేయులు, రాజు, రంగయ్య, గూళ్యం రామాంజ నేయులు, అరికెర ఆంజనేయ పాల్గొన్నారు.