Share News

సజ్జలగుడ్డం అంతా ఖాళీ

ABN , Publish Date - Jan 23 , 2025 | 12:39 AM

మండలంలోని సజ్జల గుడ్డం గ్రామంలో మూడు నెలల నుంచి ఉపాధి హామీ పనులు ప్రారంభిం చలేదు.

సజ్జలగుడ్డం అంతా ఖాళీ
గుంటూరుకు వలస వెళ్తున్న గ్రామస్థులు

పనులు లేక వంద కుటుంబాలు వలస

కోసిగి, జనవరి 22(ఆంధ్రజ్యోతి): మండలంలోని సజ్జల గుడ్డం గ్రామంలో మూడు నెలల నుంచి ఉపాధి హామీ పనులు ప్రారంభిం చలేదు. స్థానికంగా గ్రామంలో పనుల్లేక పోవడంతో ప్రజలు వేరే ప్రాంతాలకు వెళ్లి పనులు చేసుకునేవారు. అక్కడ కూడా పనులు ముగియడంతో గ్రామంలో ఉపాధి పనులు అధికారులు ప్రారంభించక పోవడంతో బుధవారం గ్రామంలోని సుమారు వంద కుటుంబాలు ఐదు వాహనాల్లో మూటముళ్లే సర్దుకుని వలసబాట పట్టారు. గ్రామానికి చెందిన ఫీల్డ్‌ అసిస్టెంట్‌ అధికారులు గ్రామంలో ఉపాధి పనులు నేటికి కూడా ప్రారంభించలేదని, అందుకే వలస వెళ్తున్నామని తెలిపారు. గ్రామానికి చెందిన 70 ఎస్సీ కుటుంబాలు ఇళ్లకు తాళాలు వేసి గుంటూరుకు పయనమయ్యారు. గ్రామం అంతా బుధవారం రాత్రి ఇళ్లకు తాళాలు వేసి ఉపాధి కోసం ఊరు వదిలారు.

Updated Date - Jan 23 , 2025 | 12:39 AM