Share News

అర్హులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలి

ABN , Publish Date - Jun 24 , 2025 | 12:39 AM

పట్టణంలో అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి రూ.5లక్షలతో గృహ నిర్మాణం చేపట్టాలని సీపీఎం పట్టణ కార్యదర్శి రణధీర్‌ కోరారు.

అర్హులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలి
కురుకుందలో ప్రజలతో కలిసి ధర్నా చేస్తున్న సీపీఎం నాయకులు

ఆత్మకూరు, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): పట్టణంలో అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి రూ.5లక్షలతో గృహ నిర్మాణం చేపట్టాలని సీపీఎం పట్టణ కార్యదర్శి రణధీర్‌ కోరారు. మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌బాబుకు సోమవారం వినతిపత్రం అందజేశారు. నాయకులు సురేంద్ర, నాగేశ్వరరావు, వీరన్న, ఇస్మాయిల్‌, నబి, శ్రీను తదితరులు ఉన్నారు. ్ఝ

ఆత్మకూరు రూరల్‌: అర్హులైన పేదలందరికి ఇళ్లస్థలాలను మంజూరు చేసి పక్కా గృహాలు నిర్మించుకునేందుకు ఐదు లక్షలు ఇవ్వాలని సీపీఎం జిల్లా నాయకులు రణధీర్‌,మండల నాయకులు మాబాషా, వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. కురుకుంద గ్రామంలో అర్జి దారులతో కలిసి గ్రామ సచివాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం సచివాలయ ఉద్యోగులకు వినతిపత్రాన్ని అందజేశారు. నాయకులు హరికృష్ణ, వీరన్న, లక్ష్మీనారాయణ, మౌళాలి,చిన్న శేషన్న,మన్సూర్‌ భాషలు పాల్గొన్నారు.

నందికొట్కూరు: రాష్ట్రంలో వేలాది పేద, భూమిలేని కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని సీపీఐ (ఎంఎల్‌) లిబరేషన్‌ పార్టీ ఆధ్వర్యంలో ఇళ్లు లేని కుటుంబాలతో కలిసి నందికొట్కూరు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. సీపీఐ (ఎంఎల్‌) లిబరేషన్‌ జిల్లా నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు, ఏఐఎస్‌ఎఫ్‌ ఉమ్మడి జిల్లా కార్యదర్శి ఎస్‌.నాగార్జున పాల్గొన్నారు. వివిధ సంఘాల నాయకులు ఏసన్న, సుధాకర్‌, సోమన్న, రామకృష్ణ, ఎల్లనాయుడు, ఇజ్రాయేల్‌, వెంకటేశ్వర్లు, వేణు, ఈడిగ నరసింహ, మధుగౌడు, నారాయణ, మహిళా సంఘం నాయకురాలు ఎస్‌బీబీ లక్ష్మిదేవి, మల్లేశ్వరమ్మ, శ్యామల, గోవిందమ్మ పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2025 | 12:39 AM