Share News

వ్యవసాయం.. ఓ జూదం

ABN , Publish Date - Jan 30 , 2025 | 12:24 AM

చౌళకాయల ధర పడిపొవడంతో రైతులు కుదేలవుతున్నారు. రూ.వేలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే, పెట్టుబడి కూడా వచ్చేలా లేదని ఆవేదన చెందుతున్నారు.

వ్యవసాయం.. ఓ జూదం
దేవనకొండలో పొలంలోనే వదిలేసిన చౌళకాయలుమద్దికెరలో నిల్వ ఉంచిన కంది దిగుబడి

దేవనకొండలో ధర లేక చౌళకాయలను వదిలేసిన రైతులు , మద్దికెరలో గోనె సంచులు లేవని నిలిచిపోయిన కంది కొనుగోళ్లు

దేవనకొండ, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): చౌళకాయల ధర పడిపొవడంతో రైతులు కుదేలవుతున్నారు. రూ.వేలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే, పెట్టుబడి కూడా వచ్చేలా లేదని ఆవేదన చెందుతున్నారు.

పడిపోయిన ధర

రూ.వేలల్లో పెట్టుబడి పెట్టి సాగు చేస్తే, పంట చేతికందే సమయంలో ధర పతనమైంది. పంట కొత ఖర్చులకు కుడా వెళ్లని దయనియపరిస్థితి నెలకొందని రైతులు అవేదన చెందుతున్నారు. రబీలో సాగునీటి కాల్వ ,బోర్ల కింద రైతుల చౌళకాయ పంటను సాగు చేశారు. ప్రస్తుతం సంచి చౌళకాయల (18 కేజీలు) ధర రూ.200లు గా ఉంది. పంట కొసేందుకు కూలీలకు సంచికి రూ.120లు ఖర్చు కాగా, సంచి కనేందుకు రూ.10, మార్కెట్‌కు రవణాకు రూ.20లు చెల్లించాలి. దీంతో పెట్టుబడి రాకపోగా, నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు.

రూ.1.5లక్షలు నష్టపోయాను.

ఐదు ఎకరాలు కౌలుకి తీసుకొని చౌళకాయ సాగు చేశాను. పంట మొదటి కొత కోస్తే కూలీలకే సరిపొయింది. మార్కెట్‌లో ధర లేలేకపోవడంతో చేసేదీమీ లేక పొలంలోనే వదిలేశాను. రూ.1.5 లక్షలు నష్టపోయాను. - మహేష్‌, రైతు దేవనకొండ

మద్దికెర, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): మండలలో ఖరీఫ్‌, రబీలో 12వేల ఎకరాల్లో కందులు సాగు చేశారు. ఎకరాకు 5 నుంచి 6 వరకు క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అదిగో ఇదిగో అన్న అధికారులు రభుత్వ మద్దతు ధర రూ.7,550ల ప్రకారం కొనుగోలుకు సిద్ధమయ్యారు. అయితే గోనెసంచులు లేకపోవడంతో కొనుగోళ్లు నిలిచిపోయా యయి. గోనెసంచులు రాలే దని వచ్చాక కొనుగోలు చేస్తా మని మార్క్‌ఎడ్‌ అధికారులు అంటున్నారు. దీంతో రైతులు నిరాశ చెందుతున్నారు.

ఎదురు చూస్తున్నాం

కందు లను కొను గోలు చేస్తామంటే సంబరపడిపో యాం. విక్రయించుదుకు రాగా, గోనెసంచులు లేవని అధిఆరులు కొనుగోలు చేయడం లేదు. ఎప్పుడు కొనుగోలు చేస్తారోనని ఎదురు చూస్తున్నాం. - కృష్ణ, రైతు.

Updated Date - Jan 30 , 2025 | 12:32 AM