Share News

‘ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలి’

ABN , Publish Date - Dec 16 , 2025 | 12:06 AM

ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు ఈరమ్మ, రంగమ్మ, హుస్సెన్‌బీ, ఎలీషమ్మ డిమాండ్‌ చేశారు.

‘ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలి’
ఎమ్మిగనూరులో రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలుపుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా సమాఖ్య నాయకులు

ఎమ్మిగనూరు టౌన్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు ఈరమ్మ, రంగమ్మ, హుస్సెన్‌బీ, ఎలీషమ్మ డిమాండ్‌ చేశారు. ఆదోని జిల్లా సాధన జేఏసీ గౌరవ అధ్యక్షులు కమలే గణేష్‌, ఆదోని జిల్లా సాధన విద్యార్థి జేఏసీ నాయకులు శేఖర్‌ ఉదయ్‌ చేపట్టిన 6వ రోజు రిలే నిరాహాక దీక్షలో కూర్చోని మద్దతు తెలిపారు. రిలే నిరాహార దీక్షకు మహీళా సంఘాలు, కాశీంబీ, ఈరమ్మ మద్దతు తెలిపారు. జేఏసీ నాయకులు రఘు, శేఖర్‌, ఉదయ్‌, కృష్ణ, ఖాజా, ఆఫ్రీది, బతకన్న పాల్గొన్నారు.

మంత్రాలయం: ఆదోని జిల్లా చేసేంతవరకు పోరాడతామని విద్యార్థి, యువజన, ప్రజాసంఘాల ఆదోని జిల్లా సాధన జేఏసీ కన్వీనర్‌ రామతీర్థం అమ్రేష్‌ అన్నారు. సోమవారం మంత్రాలయం రాఘవేంద్ర సర్కిల్‌లో ఆదోని జిల్లా సాధన జేఏసీ నాయకులు బీఎస్‌ఎస్‌, బీఎస్పీ, బుడగజంగాల, మాలమహానాడు సంయుక్త ఆధ్వర్యంలో రాఘవేంద్ర సర్కిల్‌లో భారీ ఎత్తున మానవహారం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక వేదికపై నాలుగో రోజు జాలవాడి, కంబలదిన్నె నాయకులు రత్నం, చిన్నమహాదేవ్‌, రాము, లక్ష్మన్న, బజారితో పాటు బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి మంచాల లక్ష్మీనారాయణ, బుడగజంగాల రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రుద్రాక్షల దస్తగిరి, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు సామేల్‌, రాష్ట్ర కన్వీనర్‌ బోయ రవికుమార్‌, యాకోబ్‌, సుధాకర్‌, మర్రిస్వామితో పాటు 25 మంది రిలే నిరహార దీక్షల్లో కూర్చున్నారు. కార్యక్రమంలో ప్రసన్న, భీమన్న, రాజు, మాలమహనాడు జిల్లా కన్వీనర్‌ ఉసేని, యోబు, ప్రభదాస్‌, కుమార్‌, రాజు, దేవదాసు, జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 16 , 2025 | 12:06 AM